మారవా! మనిషివి కావా!!

by Ravi |   (  Updated:2025-01-12 21:01:14  IST  )

Poem

మారవా! మనిషివి కావా!!
X

నువ్వూ... నేనూ... వేరై ఉండొచ్చు

నాలో దాగున్నది నువ్వేనని

నీలో నిండి ఉన్నది నేనేనని

ఎలా చెప్పాలి నీకు ?

చుట్టూ నిశిని చూస్తూ

ఇంకెన్నాళ్ళు కాలం గడిపేస్తావ్

మదిలో కదలికలు

లేకుండా ఇంకెన్నాళ్ళు

శిధిలావస్థలో నిలుచుండిపోతావ్?

మారవా....! మనిషివి కావా.....!!

కర్కోటపు ఆలోచలనడుమన

కత్తిగాట్లు వేసుకుంటూ...

మూర్ఖంగా వ్యక్తిత్వపు పునాదులకు

చెదలు పడుతుంటే ఇంకా

ఏం చూసుకొని నీకంత అహం

ఆరోగ్యం కోల్పోయి,

వయసును కోల్పోయి

చితికి దగ్గరయ్యాక ఏం చేద్దామని..!!

అప్పుడెంత వెతికిన శూన్యంలో

రాతలు తప్ప ఏముంటుంది??

గతితప్పిన గాలిపటంలా

ఇంకెన్నాళ్ళు బతుకుతావ్?

రా! కాసేపలా కూర్చుని

మనసిప్పి మాట్లాడుకుందాం

అహాన్ని అలా పక్కకు నెట్టి

ప్రేమను గుండెల నిండుగా

నింపుకుని ముచ్చటించుకుందాం..

వాసి జ్యోత్స్న

98668 43005

Next Story