భక్తి బెత్తం పట్టుకుంది

by Ravi |   (  Updated:2025-01-12 23:00:22  IST  )

Poem

భక్తి బెత్తం పట్టుకుంది
X

వరాహ కోరల మీద

భూమి నెత్తినట్టు

గురువును

నాలిక చివర ఎత్తారు గదరా!

ఎవడు బ్రహ్మ

ఎవడు విష్ణు

ఎవడు శివుడు

ఏ రంగుబట్టల్లో

మాయమయ్యాడు గురువు

గురువు చేవ్రాలు

పాల బుగ్గల కాళ్ళ మీద

రుద్రాక్షల కాట్లు

గురువు ఒంటి మీద

ముఖానికి వేలాడుతున్న

పూజల చీత్కారం

మనసులో దిగబడి

నెత్తరు చప్పరిస్తున్న మాటలు

ఒక మౌడ్యం అడుగుల

చప్పుడు విని బడి గోడల్ని

భయం కౌగిలించుకుంటుంది

గురువు చేతుల్లోంచి లాగేసి

భక్తి రసం బడిలో బెత్తం

పట్టుకుని తిరుగుతుంది

పసితనానికి దీక్షలు తొడిగిన

ఒక కోరలు మొలిచిన సంప్రదాయం

పాఠాల మధ్య పహారా కాస్తుంది

-వడ్డెబోయిన శ్రీనివాస్

98857 56071

Next Story