ఒక్క నిమిషం...

by Ravi |   (  Updated:2025-01-12 23:30:30  IST  )

Poem

ఒక్క నిమిషం...
X

పెన్ను ఇవ్వమని మాత్రం అడక్కండి

మా చెడ్డ కోపం వచ్చేస్తుంది

నా కలం నీ చేతికి ఇవ్వడం

నా పనిలో పడి మర్చిపోవడం

నీవూ... కనిపించకపోవడం

ఎందుకీ గందరగోళం...

అప్పటికీ... జాగ్రత్త పడ్డాను

పెన్ క్యాప్ నాతో ఉంచుకుని ఇచ్చాను

అతని పని తెమలటం లేదు...

అడిగేందుకిక తెగని మొహమాటం

ఎందుకొచ్చిన తంటా ఇదీ...

కలం అంటే...

అదేదో... సిరా నింపుకున్న గొట్టం కాదు

రూపాయి వస్తువేనని అనుకోవద్దు

కలం అంటే... ప్రాణ సమానం

గుండెల హత్తుకుని ఉండే నేస్తం

నన్ను విశ్లేషించే శారదా పీఠం

నన్నెత్తుకుని తిప్పే అమ్మానాన్నల భుజం

కలం... బ్రహ్మదేవుని అస్త్రం

ఘన చరితను లిఖించే శస్త్రం

ఒక్క నిమిషం...

పెన్ను ఇవ్వమని మాత్రం అడక్కండి

అదొక అద్భుతమైన ఆభరణం

పెన్ను... కలం...

నా శ్వాస... నా గుండె చప్పుడు

మన్మోహన్ రంగినేని

7989544533

Next Story