అమరత్వం రమణీయం

by Ravi |   (  Updated:2025-01-05 23:46:14  IST  )

Poem

అమరత్వం రమణీయం
X

భూమాత ఎంతటి గోస పడ్డదో

కన్న తల్లి ఎన్ని కన్నీళ్లు పెట్టిందో

అడవి తల్లి ఎలా బాధపడ్డదో

రాలిన నెత్తుటి విత్తనాలకు

ఎన్నెన్ని ఎర్రజెండాలు పూస్తయో

ఒరిగిన దేహపు స్పర్శతో...

ఎండిన ఆకులు ఎన్ని గొంతుకలై

పోటెత్తిన గీతాలు పాడుతయో

మీ అమరత్వంతో ఎన్ని లక్షల పిడికిళ్ళు

ఆశయ సాధనకోసం మొలుస్తయో!

రమణా చారి

99898 63039

Next Story