- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
సూర్యుడితో పోటీపడుతూ
రోజంతా చెమటలు చిందుతూ
మూర్తీభవించిన సహనానికి మారుపేరుగా
చల్లని పన్నీరు చిలకరిస్తూ!
గడియారం లోని లోలకంలా
కాలాన్ని నడిపిస్తుంది
కాలంతో పోటీ పడుతూ
కార్యాన్ని సాధిస్తుంది!
సముద్రం లోతును
ఆకాశం ఎత్తును
వీడని తన సొత్తులుగా చేసుకొని
ప్రకృతిలోని ప్రతి కార్యాన్ని నెరవేరుస్తూ
అక్షర సరస్వతిలా
పాఠాలు నేర్పుతుంది!
వెదకకున్నా ఎందైనా కనిపిస్తూ
ఊడ్చే చీపిరి కట్టలో
తుడిచే పాత బట్టలో
చేతి టీ కప్పులో
తినే ముద్దలో
నిద్రలో మెళుకువలో
తన ముద్రనువేస్తుంది!
మట్టి గోడల ఇల్లును
మమతల గుడిని చేస్తుంది!
తను సహనశీలే కాదు సాహసి!
జగ్గయ్య.జి
98495 25802
- Tags
- Poem
Next Story






