- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్ డెస్క్ : మంచు వర్షంలా కురుస్తుంది
డిల్లీ గెస్ట్‌హౌస్ మసక మసకగా కనిపిస్తుంది
కాశ్మీర్ తాటాకంలో
పడవలకు మంచు తెరల శోభ
కడలి తరంగాల పై మంచు
వంతెనలు కడుతుంది
అరకులోయ మంచు ముత్యాల పందిరిలో
శోభలీనుతుంది
గోదావరి ఒడ్డులో కొబ్బరితోట
దోమతెర కడుతున్న మంచు పొర
రోడ్లు అద్దాలపై నడుస్తున్న కార్లు జారి పడుతున్నాయి
ఆ పత్తి చేలోకి వెళుతున్న
శ్రామిక స్త్రీలు తలపాగాలు ధరించి
మెరుస్తున్న కళ్ళతో నడుస్తున్నారు
చలి పసికందులు పొత్తిళ్ళలో
జొరబడి వణికిస్తుంది
జీవితం, ప్రకృతి ఘర్షణలో వుంది
పాలకులు అంకెల గారడీలు చేస్తున్నారు
కోటి మంది నవ్వులు కోట్ల మంది ప్రజల్లో నిరాశ
అంకెలు ఎప్పుడూ సౌందర్యంగానే వుంటాయి
రాజ్యం అంకెల మెట్ల మీద అధిరోహిస్తుంది
ఆ మట్టి తీసే వాడి చేతుల్లో
పలుగు, పార ప్రశ్నస్తున్నాయి?
నీ చెమట చుక్కలకు ఫలితం ఏదని?
ధ్యాన్యాగారాల లెక్కలు చెబుతున్నారు
ఆ మొక్క నాటుతున్న
ఆ సువార్త చేరెడు నేలలేక మరణిస్తుంది
నదీ తరంగాలను కల్మషం చేస్తున్నారు
త్రివేణి సంగంలో తొక్కిసలాట
ఎందరో మృత్యువాత పడుతున్నారు
తిరుపతిలో తొక్కిసలాట
కైలాస యాత్రకు ఎందరో వెళ్ళారు
హజ్‌యాత్రలో వందల మంది హతులవుతున్నారు
మృత్యువు నోరు తెరిచి వుంది
మత మత్తు విస్తరిస్తుంది
ముందు నివశిస్తున్న నివాసంలో
శాంతిని సాధించండి
పుణ్యం అంటే ఏమిటి?
నీ ఇంట్లో పది మందికి
చేయి కడిగిస్తే అదేగా పుణ్యం
విగ్రహాలు, క్షేత్రాలు సందర్శిస్తే ఏమి వస్తుంది?
అత్త చనిపోయింది
ఆ కోడలు తలుపు వేసుకొంది
ఆ శవం వర్షంలో తడిసింది
ఊళ్ళో వాళ్ళు శవదహనం చేశారు
ఆ కోడలు ఇల్లు తగల బడింది
ఎవరు ఆ దరికి రాలేదు
ఎవరో, సంపాదించినదాన్ని
ఆక్రమించాలను కోవడం ఒక దురాశ
స్వీయ జీవన నిర్మాణం ఒక జీవన ధర్మం
ప్రకృతి విధ్వంసం అవుతున్న కొలది
శరీర రుగ్మతల విస్తృతి
ప్రపంచం నలుమూలల
ద్వారాలు మూసుకుంటున్నాయి
ఒక దేశ ఆత్మ గౌరవం ఏమౌతుంది
నేల కింద జీవ శక్తులున్న వారు
మేఘాలు నిస్సార భూములకు చేరుతున్నాయి
తెల్ల నేలపై విమాన ఘర్షణ
అక్కడ డాలర్ పెరుగుతోంది
మనిషి తరిగిపోతున్నాడు
నీ రూపాయిని రష్యా వాడు చెల్లదంటున్నాడు
అంబేడ్కర్ అప్పుడే చెప్పాడు
మీరు దేశీయ భావన పెంచుకొండి
మీ ఒనరులను మీరు గుర్తించండి
అవి మిమ్మల్ని వెలిగిస్తాయి
నిజమే అక్షరం వెలుగు
కిరీటంగా మారుతూవుంది
బాలికల విద్యార్జన ప్రయత్నం ఓ వెన్నెల
భాషల అభివ్యక్తి ఓ నదీ ప్రవాహం
ఒకే యూనిఫామ్‌లో వారు బారులు తీరి
అసెంబ్లీ చేస్తున్న దృశ్యం, రమణీయం
తనకు పుట్టిన్న బిడ్డ
నూత్న భాషలో మాట్లాడుతున్నప్పుడు
ఆ తల్లికి కలిగే ఆనందం అపూర్వం
చేస్తున్న కష్టం మరచిపోతుంది కదా
మార్పు ఎక్కడో లేదు
నీ కళ్ళ ముందే వుంది
నిరాశ, నిస్పృహ జీవితానికి తిరోగమనం
జీవించటం అంటే అనుభూతి చెందడం
ఆస్వాదించడం, ఆలోచించడం
అవగాహన చేసుకోవడం
అనుభూతం చేసుకొండి
అందులోనే భవిష్యత్ దర్శనం వుంది
అనేక వైరుధ్యాలు అనేక సానుకూలతలు
చెయ్యి చాచినపుడంతా అధీనత
ఇస్తున్నపుడు కలిగేదే అనుభూతి
అంబేడ్కర్ జ్ఞానం ఇచ్చే వెళ్ళాడు
ఆయనకు మరణం లేదు
ఆ చూపుడు వేలు వేపు చూడండి
మిమ్ము వెలిగిస్తుంది
ఆ వెలుగుల దారిలో నడుద్దాం.
మహాకవి డా॥కత్తి పద్మారావు
గుంటూరు జిల్లా,
ఆంధ్రప్రదేశ్.
98497 41695
- Tags
- Katti Padma Rao






