మనీ ఎందుకు వేస్ట్.. సెకండ్ హ్యాండ్ బెస్ట్!

by Sujitha Rachapalli |

మోడీ సార్ ఏం చెప్తుండు? పైసలు ఆదా చేయండి. బంగారం కొనకండి. పొదుపుగా ఉండండి అని. రాబోయే పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టీ మోడీ సార్ మనకు సందేశాన్నిచ్చిండు.

మనీ ఎందుకు వేస్ట్.. సెకండ్ హ్యాండ్ బెస్ట్!
X

దిశ, ఫీచర్స్ : మోడీ సార్ ఏం చెప్తుండు? పైసలు ఆదా చేయండి. బంగారం కొనకండి. పొదుపుగా ఉండండి అని. రాబోయే పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టీ మోడీ సార్ మనకు సందేశాన్నిచ్చిండు. కాబట్టి మనం కూడా డబ్బులు జాగ్రత్తగా ఖర్చు చేద్దాం అనుకుంటున్నారు జనాలు. అందుకేనేమో సెకండ్ హ్యాండ్ షాపింగ్ ట్రెండ్ ప్రాచుర్యంలోకి వస్తోంది.

కొత్తవే ఎందుకు..

కొత్త వాటికంటే పాతవి.. అంటే సెకండ్ హ్యాండ్‌ వస్తువులు కొనడం ఇప్పుడు ఫ్యాషన్‌గా మారుతోంది. పర్యావరణాన్ని కాపాడుకోవడం.. డబ్బు ఆదా చేయడం.. యూనిక్ స్టయిల్ పొందడం వంటివన్నీ సెకండ్ హ్యాండ్ షాపింగ్‌ ఆలోచనను మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నాయి. మరీ ముఖ్యంగా బట్టల షాపింగ్. ఒకప్పుడు ఎంత మంచి బట్టలేసుకుంటే అంత మంచి మర్యాద, గౌరవం ఉండేవి. ఇప్పటి యువత ఆలోచనా విధానం మారుతోంది. బట్టలు కొత్తవే ఎందుకు కొనాలి? సెకండ్ హ్యాండ్ బట్టలు కొంటే సరిపోతుందిగా? అనుకుంటోంది.

80% వరకు ఆదా..

సెకండ్ హ్యాండ్ ఫ్యాషన్ కేవలం ట్రెండ్ మాత్రమే కాదు. భవిష్యత్‌కు పునాది అని చెప్పుకోవచ్చు. డబ్బు ఆదా చేస్తూ.. పర్యావరణాన్ని కాపాడుతూ.. స్టయిలిష్‌గా ఉండాలనుకునే వారందరికీ ఇది మంచి ఆప్షన్. బట్టల విషయానికి వస్తే సెకండ్ హ్యాండ్ షాపింగ్ వల్ల బ్రాండెడ్ బట్టలు, డిజైనర్ వస్త్రాలు చాలా తక్కువ ధరలకు దొరుకుతాయి. ధరలో 50-80% వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. ఫాస్ట్ ఫ్యాషన్ వల్ల ప్రతి సంవత్సరం కోట్లాది టన్నుల బట్టలు వ్యర్థం అవుతున్నాయి. అదే సెకండ్ హ్యాండ్ షాపింగ్ ద్వారా కొత్త ఉత్పత్తి తగ్గి, కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి.

హాట్ ఐటమ్స్‌..

ప్రపంచంలో రీసేల్ మార్కెట్ వేగంగా పెరుగుతోంది. ఇండియా వంటి దేశాల్లో ఇది ఇంకా వేగంగా విస్తరిస్తోంది. ఒలిక్స్.. క్విక్‌రైడ్.. ఫేస్‌బుక్ మార్కెట్‌ ప్లేస్‌తో పాటు పలు స్పెషల్ సెకండ్ హ్యాండ్ స్టోర్లు, ఆన్‌లైన్ యాప్‌లు చాలా అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీలలో వింటేజ్ స్టోర్లు యువతను ఆకర్షిస్తున్నాయి. సెకండ్ హ్యాండ్ మార్కెట్‌ ఎక్కువగా డెనిమ్ జీన్స్, జాకెట్స్, టీ షర్టులు.. బాగా అమ్ముడవుతున్నాయి. లెదర్ జాకెట్లు, బ్లేజర్లు, వింటేజ్ డ్రెస్సులు కూడా హాట్ ఐటమ్స్‌గా సేల్ అవుతుంటాయి.

స్మార్ట్ హ్యాండ్‌..

భారత్ సెకండ్ హ్యాండ్ మార్కెట్ 2024లో సుమారు 3500 మిలియన్ డాలర్లు. 13.2% కార్గ్‌‌తో 2027 నాటికి 5.1 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని మార్కెట్ అంచనా. స్వీడన్, యూరప్ దేశాల్లో 75% మంది జనం ఏదో ఒకసారి సెకండ్ హ్యాండ్ కొంటూనే ఉంటారు. అమెరికాలో సెకండ్ హ్యాండ్ మార్కెట్‌కు చాలా ఆదరణ ఉంటుంది. జపాన్‌లో లగ్జరీ సెకండ్ హ్యాండ్ బాగా అమ్ముడవుతుంది. ఈ ట్రెండ్‌ను ముఖ్యంగా 18-35 సంవత్సరాలు మహిళలు, కాలేజీ విద్యార్థులు, యంగ్ ప్రొఫెషనల్స్ ఇష్టపడుతున్నారు. ఇది సెకండ్ హ్యాండ్ కాదు.. స్మార్ట్ హ్యాండ్‌ అనేది వాళ్ల బావన.

Next Story