'దయ'తో ఆందోళన, డిప్రెషన్‌ దూరం

by Disha Web Desk 10 |
దయతో ఆందోళన, డిప్రెషన్‌ దూరం
X

దిశ, ఫీచర్స్ : మనుషుల్లోని దయాగుణం వారికి మంచి గుర్తింపును తెచ్చిపెడుతుందని మనకు తెలిసిందే. కానీ తాజా అధ్యయనం ప్రకారం ఇది వ్యక్తుల్లోని భయాందోళన, డిప్రెషన్‌ను కూడా దూరం చేయగలుతోందని తాజా అధ్యయనం గుర్తించింది. దయ అంటే నిస్వార్థంగా ఇతరులకు సహాయం చేయడం లేదా ఇతరుల అవసరాలు తీర్చడం. కాగా ఇతరుల పట్ల జాలితో వ్యవహరించే వారు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని, ఆందోళన, నిరాశ చుట్టుముట్టినా వెంటనే కోలుకోగలుగుతారని ఓహియో స్టేట్ యూనివర్శిటీకి చెందిన డేవిడ్ క్రెగ్, జెన్నీఫర్ చీవెన్స్‌ల అధ్యయనంలో తేలింది. అందుకే సామాజిక శ్రేయస్సుతో ముడిపడిన దయామయ జీవితాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

అధ్యయనంలో భాగంగా ఒహియోకు చెందిన 122 మంది వాలంటీర్లను నిపుణులు పరిశీలించగా వీరు సంక్షోభంవల్ల నిరాశ, నిస్పృహలో ఉన్నారు. వీరిని మూడు గ్రూపులుగా విభజించారు. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (CBT) నిర్వహించి.. వారిలో ఆందోళన, నిరాశా స్థితులను పరిశీలించారు. ఒకటి, రెండు బృందాలను అలాగే ఉంచి, మూడవ బృందం వారానికి రెండు రోజుల పాటు దయతో కూడిన చర్యలు తీసుకోవాలని సూచించిన పరిశోధకులు ఆ తర్వాత మూడవ బృందంలోని వారి బాధలు తగ్గిపోవడం, నిరాశ, నిస్పృహలు దూరమవడం గమనించారు. ప్రజలపట్ల దయా గుణం కలిగి ఉండటం, ఇతరుల అవసరాలపై దృష్టి పెట్టడం వారిని ఆందోళనలకు, డిప్రెషన్‌లకు దూరం చేసింది. మరోదఫా మూడు టీమ్‌లను ఐదు వారాల పాటు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. ఈ సందర్భంగా మూడు సమూహాలు సంతృప్తి చెందాయి. అయితే వీరిలో మూడవ బృందం మాత్రమే దయతో కూడిన కార్యకలాపాలు అప్పగించగా అవి నెరవేర్చడంవల్ల వీరిలో ఆందోళన, డిప్రెషన్ తగ్గిపోయాయి.

ఫిజికల్ యాక్టివిటీస్‌కు దూరంగా చిల్ర్డన్స్


Next Story

Most Viewed