- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Winter Health : వింటర్‌లో గొంతు నొప్పి.. నిర్లక్ష్యం చేస్తే జరిగేది ఇదే..

దిశ, ఫీచర్స్ : చలికాలంలో సాధారణంగా తలెత్తే సమస్యల్లో గొంత నొప్పి ఒకటి. చిన్న సమస్యే కదా అని నిర్లక్ష్యం చేస్తే.. కొన్ని సార్లు అది పెద్దగా మారవచ్చు. ముఖ్యంగా వింటర్‌లో గొంతునొప్పి విషయంలో అది జరిగే అవకాశం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. సాధారణంగా ఈ సీజన్‌లో వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాలతో గొంతు నొప్పి సహా దగ్గు, జలుబు, కొన్ని రకాల అలెర్జీలు వస్తుంటాయి. ముఖ్యంగా మోనోన్యూక్లియోసిస్ వంటి వైరస్‌లు గొంతు ఇన్ఫెక్షన్‌కు కారణమవుతాయి. ఇంకా ఏయే సమస్యలు తలెత్తుతాయో చూద్దాం.
* ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది : గొంతు నొప్పి రావడానికి ప్రధాన కారణాల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఒక కారణం. దీని కారణంగా గొంతు ఎర్రబడటం, నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. దీనిని నిర్లక్ష్యం చేస్తే రుమాటిక్ ఫీవర్, కిడ్నీలో చీము, నెఫ్రైటిస్ వంటి సమస్యలకు కారణం అవుతుంది. అందుకే ఎక్కువ రోజులు గొంతు సమస్య ఉన్నట్లైతే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.
*టాన్సిల్స్, క్యాన్సర్: దీర్ఘకాలం పాటు గొంతు సమస్య ఉన్నట్లైతే అది క్యాన్సర్‌కు దారితీయవచ్చు. సాధారణంగా ఇది ఫారింక్స్ లేదా టాన్సిల్స్ నుండి ఏర్పడుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పొడి తగ్గు, మింగడం కష్టమనిపించడం, వాయిస్ మారిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. దీనిని నిర్లక్ష్యం చేసినట్లైతే, పెదాలు, బుగ్గలు, చిగుళ్లు, అంగిలి, టాన్సిల్స్, నాలుకకు విస్తరించవచ్చు. అలాగే తీవ్రమైన అలెర్జీలను కూడా నిర్లక్ష్యం చేయవద్దు.
*ఆహార నియమాలు అవసరం: గొంతు నొప్పి ఉన్నవారు నారింజ, నిమ్మ వంటి పుల్లటి పదార్థాలు తీసుకోకూడదు. ఇవి గొంతులో మరింత అసౌకర్యంను కలిగించే ప్రమాదం ఉంది. చాలామంది గొంతు నొప్పిని లెక్కచేయకుండా ఐస్‌క్రీమ్, శీతల పానియాలు, పెరుగు, వేయించిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటారు. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయి. ఫలితంగా నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది.
*నోట్: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.
Read More...
Ice bath: ఐస్ బాత్ చేయడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..?






