అక్రమ సంబంధాలు ఎందుకు పెట్టుకుంటున్నారు..? తృప్తి కలగకనేనా..?

by Chintha Aamani |   (  Updated:2023-11-24 11:47:40  IST  )

పెళ్లి అంటే నూరేళ్ల పంట అని అంటారు మన పెద్దలు. వివాహం ఒక

అక్రమ సంబంధాలు ఎందుకు పెట్టుకుంటున్నారు..? తృప్తి కలగకనేనా..?
X

దిశ, వెబ్ డెస్క్ : పెళ్లి అంటే నూరేళ్ల పంట అని అంటారు మన పెద్దలు. వివాహం ఒక సంబంధం కాదు.. ఒక తీయని భావోద్వేగం. కానీ ఆ ఇద్దరిలో ఉండే భావోద్వేగాలను నలుగురితో పంచుకుంటున్నారు. ఈ రోజుల్లో కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. ఇతరులతో శారీరక సంబంధం పెట్టుకుని, నకిలీ బంధాలలో మునిగిపోతున్నారు. ప్రేమకి, కామానికి తేడా తెలియకుండా ప్రేమ అంటే అంగడిలో దొరికే వస్తువుగా వ్యవహరిస్తున్నారు. పాశ్చాత్య సంస్కృతి అంటే ఈసడించుకునే పరిస్థితి పోయి మనం కూడా అదే దారిలో నడిచేందుకు ఇష్టపడుతున్నామన్న భావన కాల క్రమేణా బలపడుతుంది. వివాహేతర సంబంధాలకు మొగ్గు చూపాడానికి అనేక కారణాలు ఉంటాయి. అందులో కొన్ని పరిశీలిద్దాం.

పెద్దలు కుదిర్చిన వివాహాల దంపతులే కాదు.. ఒకరంటే ఒకరు ఇష్టపడి చేసుకున్న దంపతులు కూడా పొరుగింటి పుల్లకూర రుచి అనే శైలిలో వ్యవహరిస్తున్నారు. దాంపత్య జీవితంలో ఏమాత్రం అసంతృప్తి ఉన్నా.. వెంటనే పక్క చూపులు చూస్తున్నారు. ఫలితంగా అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. ఈ తరం దంపతుల పోకడ పాతతరం వారికి ఆందోళనకు కారణమవుతోంది.

దంపతుల్లో చాలామందికి ఇతరులతో తమ జీవిత భాగస్వామిని పోల్చి చూసుకునే బలహీనత ఉంటుంది. భార్య ఆశించినట్టు భర్త లేడనో, భర్త ఆశించినట్టు భార్య లేదనే అసంతృప్తికి లోనవుతుంటారు. ఈ అసంతృప్తిలో వివాహేతర సంబంధాల ఉచ్చులో పడుతుంటారు. విషయం బయటపడ్డాక కాపురాలు కూలుతుండటం ఇటీవల కాలంలో ఎక్కువైంది. వివాహేతర సంబంధాలు విభేదాలకు కారణమై చివరికి విడాకుల వరకు వెళ్తున్నాయి.

వివాహ జీవితంలో శారీరక సాన్నిహిత్యం కీలక పాత్ర పోషిస్తుంది. ఒక జంట కలిసి శృంగారంలో నిమగ్నమైనప్పుడు, ఒకరి అవసరాలను మరొకరు తెలుసుకోవాలి. కానీ భాగస్వామి లైంగిక అవసరాలు సరిగా తీర్చకుంటే.. అది నిరాశగా మారుతుంది. లైంగిక అసంతృప్తి ఉంటే.. కచ్చితంగా వేరే వైపు చూస్తారు. కొందరు వ్యక్తులు పడకగదిలో సంతోషంగా లేదా సంతృప్తిగా లేనప్పుడు, బయట లైంగిక ఆనందాన్ని పొందవచ్చు. తమ కోరికలను తీర్చుకోవడం కోసం ఇతరుల మీద ఆధారపడవచ్చు. ఏది ఏమైనా.. ఇతరులతో లైంగిక సంబంధం పెట్టుకోవడం అనేది జీవితాలను నాశనం చేస్తుందని గుర్తుంచుకోవాలి.

Next Story