వెన్ను నొప్పి వేధిస్తోందా?. కారణం ఇదే కావచ్చు!

by Disha Web Desk 7 |
వెన్ను నొప్పి వేధిస్తోందా?. కారణం ఇదే కావచ్చు!
X

దిశ, ఫీచర్స్: తరుచూ సిస్టమ్ ముందు కూర్చొని పనిచేసేవారిని వేధించే ప్రధాన సమస్యల్లో వెన్నునొప్పి ఒకటి. దీంతోపాటు మెడ, కండరాలు, కీళ్ల నొప్పులు కూడా వస్తుంటాయి. ఈ సమస్య అధికమైనప్పుడు చేసే పనిపై ప్రభావం పడుతుంది. కొందరు వెన్నునొప్పి తట్టుకోలేక ఉద్యోగం కూడా మానేస్తుంటారు. కానీ పలు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అలాంటి సమస్యను అధిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

* నీరు అధికంగా తాగడం

పనిలో నిమగ్నమై కొందరు వాటర్ తాగడం మర్చిపోతుంటారు. దీనివల్ల వెన్ను నొప్పి సమస్య అధికమయ్యే అవకాశం ఉంటుందట. ఎందుకంటే కీళ్లను లూబ్రికేట్‌గా ఉంచడానికి వ్యక్తులు హైడ్రేట్‌గా ఉంచడం చాలా ముఖ్యం. అందుకోసం నీళ్లు తాగాల్సిందే. కాబట్టి మీరు ఎంత పనిలో ఉన్నా మధ్య మధ్యలో వాటర్ తాగడం మర్చిపోవద్దు.

* 45 నిమిషాలకోసారి గ్యాప్ ఇవ్వండి

ఆఫీసుల్లో గంటల తరబడి కదలకుండా కూర్చొని పనిచేయడం వల్ల వెన్ను, మెడ, భుజం నొప్పి బారిన పడే అవకాశాలు అధికం. మీరు కూర్చునే తీరును బట్టి, మీరు వాడే కంప్యూటర్ సరిగ్గా సెట్ అవ్వకపోతే కూడా ఇలా జరుగుతుంది. కాబట్టి కంప్యూటర్ కీ బోర్డు మోచేతులకు సమానమైన ఎత్తులో ఉండేలా సెట్ చేసుకోవాలి. ముందుకు వంగి కూర్చోవడం, కంటికి దగ్గరగా కంప్యూటర్‌ స్క్రీన్‌ ఉండటం అస్సలు మంచిది కాదు. ప్రతీ 45 నిమిషాలకోసారి కనీసం 10 నిమిషాలు వాకింగ్ చేయడం బెటర్.

* స్ట్రెస్ అధికమైనప్పుడు

శారీరక, మానసిక ఆరోగ్యాలు ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. శారీరకంగా తీవ్రమైన సమస్య ఎదుర్కొంటున్నప్పుడు ఆ ప్రభావం మెంటల్ హెల్త్‌పై కూడా ఉంటుంది. ఆ ఎఫెక్ట్ శరీరంపై కూడా పడుతుంది. స్ట్రెస్ ఎక్కువైన వ్యక్తుల్లో ఆకలి మందగించి, ఆహారం తక్కువగా తీసుకోవడం, బలహీనంగా మారడం జరగవచ్చు. ఈ కారణంగా కాసేపు కుర్చీపై కూర్చోగానే స్ట్రెస్‌ అనిపించడం, వెన్ను నొప్పి రావడం జరుగుతుంటాయని ఫిట్‌నెస్ నిపుణులు చెప్తున్నారు. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవడానికి అవసరమైన ప్లాన్ చేసుకోవాలి. వ్యాయామం, యోగా వంటివి ఎంచుకోవడం బెటర్.

ఇవి కూడా చదవండి: చపాతీలు ఈ విధంగా చేస్తున్నారా.. అయితే కాన్సర్ వచ్చినట్లే.?



Next Story

Most Viewed