- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Friendship: " ఫ్రెండ్ " & " బెస్ట్ ఫ్రెండ్ " కి తేడా ఏంటి?
రక్త సంబంధం లేకున్నా, కష్టం వచ్చిన ప్రతిసారి స్నేహితుడు ఆదుకుంటాడు

దిశ, వెబ్ డెస్క్ : ఈ ప్రపంచంలో ఉన్న అన్ని బంధాలలో స్నేహ బంధం ( Friendship ) చాలా గొప్పది. ఎందుకంటే, రక్త సంబంధం లేకున్నా, కష్టం వచ్చిన ప్రతిసారి స్నేహితుడు ఆదుకుంటాడు. మన బలాలేంటో, బలహీనతలేంటో తెలిసి మనల్ని అంగీకరిస్తారు. అందుకే ఈ రోజుకి కూడా ఫ్రెండ్షిప్ కి అంత వాల్యూ ఉంది. కానీ, కొన్ని స్నేహ బంధాలు ఏళ్ళు గడిచే కొద్దీ బల పడతాయి. మరి కొన్ని మధ్యలోనే తెగిపోతాయి. మనకి ఫ్రెండ్స్ ఉంటారు.. బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. అయితే, వీరిద్దరి మధ్య ఉన్న తేడా ఏంటో ఇక్కడ తెలుసుకుందాం ..
ఫ్రెండ్స్ ( Friends ) కనిపించిన ప్రతి సారి మనం నార్మల్ గా మాట్లాడి ఇంటరాక్ట్ మాత్రమే అవుతాము. వారితో హాయ్ అంటే హాయ్ .. బై అంటే బై లా ఉంటాము. అంతక మించి ఎక్కువ మాట్లాడము. మనకి సంబంధించిన విషయాలు కూడా ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోము. అలాగే, స్నేహ బంధం ఎన్ని రోజులు నడుస్తుందో కూడా చెప్పలేము. అదే బెస్ట్ ఫ్రెండ్స్ ( Best Friends ) అయితే మన కుటుంబంలో ఒకరిగా అనుకుంటాము. కష్టం వచ్చినప్పుడు ప్రతి సారి అండగా నిలుస్తారు. కలిసినప్పుడు ఎక్కువగా మాట్లాడుతుంటాము. అలాగే రోజూ ఫోన్ లో మాట్లాడుకోవడం, గిఫ్ట్ లు ఇచ్చుకోవడం , ఒకరిమీద ఒకరు నమ్మకాన్ని పెంచుకోవడం, ఒకరి అభిప్రాయాలు మరొకరు గౌరవించడం లాంటివి బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే చేస్తుంటారు.






