- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral Video: అబ్బ.. నోరూరుతుందోయ్.. నిన్ను, నీ డ్రెస్సులను చూస్తే..
Viral Video: ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో క్రియేటివిటీకి హద్దులు లేకుండా పోతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: Viral Video: ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో క్రియేటివిటీకి హద్దులు లేకుండా పోతున్నాయి. యూజర్లు తమ క్రియేటివిటీని హద్దులు దాటిస్తున్నారు. తాజాగా అలాంటి ఒక వీడియో ఇప్పుడు మనం చూడవచ్చు. మన దేశంలో ఎంతోమంది ఇష్టంగా తినే వంటకాలను దుస్తులుగా మార్చేసి డిజైనర్ వేర్ గా చూపిస్తున్న మోడల్స్ ఏఐ ద్వారా సృష్టించారు. ఈ మోడల్స్ చూసి నేటిజన్స్ క్రియేటివిటీకి ఔరా అంటున్నారు.
దోశలతో చీరలు, ఇడ్లీలతో చొక్కాలు, పానీ పూరి తో చేతి గడియారం, ఐస్ క్రీమ్ తో హ్యాండ్ బ్యాగ్, జిలేబితో నగలు, పొటాటో చిప్స్ తో చెవి కమ్మలు, ఇలా తమ క్రియేటివిటీకి పని చెప్పేశారు. ఇది చూస్తున్న నెటిజెన్లు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ చేస్తున్న వింతలకు ఆశ్చర్యపోతున్నారు. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింత విప్లవాత్మకంగా మరింత రియలిస్టిక్ గ్రాఫిక్స్ తో దూసుకెళ్తుందని అంతా భావిస్తున్నారు.
ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం సృష్టించలేనిది అంటూ ఏమీ లేకుండా మారింది. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీని మేలు కోసం ఉపయోగిస్తే మంచిదని దీన్ని ఇతరులకు హాని కలిగించే ఉపయోగిస్తేనే ప్రమాదం అని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సైబర్ నేరగాళ్లు వీటిని ఉపయోగించి ఇతరుల వ్యక్తిత్వం పైన దాడి చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
మరి మీరు కూడా ఇలాంటి ఏఐ మోడల్స్ వచ్చినప్పుడు వాటిని సరదాగా అలాగే హుందాతనంతోనూ వాడాల్సి ఉంటుంది. హద్దు మీరితే మాత్రం ఎదుటివారికి ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంటుంది అప్పుడు చిక్కుల్లో పడే ప్రమాదం కూడా ఉంటుంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ను ఉపయోగించుకుంటే మానవ మేధస్సుతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా తోడై కొత్త ప్రపంచాన్ని సృష్టించవచ్చు.






