హై హీల్స్ అదుర్స్ ఏమో కానీ.. ఇది తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

by Javid Pasha |   (  Updated:2025-10-16 07:21:20  IST  )

హై హీల్స్ సాధారణ నడకను డిస్టర్బ్ చేస్తాయి. శరీర బరువు ముందు పాదాలపై పడటంతో బ్యాలెన్స్ తప్పుతుంది. దీంతో ఆ భాగంలో గడ్డలు లేదా పుండ్లు ఏర్పడతాయి.

హై హీల్స్ అదుర్స్ ఏమో కానీ.. ఇది తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
X

దిశ, ఫీచర్స్ : పార్టీలు, ఫంక్షన్లు, ఫ్యాషన్‌ షోలు ఇలా ఎక్కడికి వెళ్లినా మహిళలు హై హీల్స్(High heels) చెప్పులు ధరిస్తుంటారు. అయితే ఇవి ఫ్యాషన్‌లో స్టైల్ స్టేఫుల్‌గా ఉండవచ్చునేమో కానీ.. పాదాల ఆరోగ్యానికి హానికరమని అమెరికన్ పోడియాట్రిక్ మెడికల్ అసోసియేషన్ అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే వీటిని ధరించడంవల్ల పాదాలు అసహజమైన కోణాల్లో ట్విస్ట్ అవుతాయని, ఎముకలు, జాయింట్లపై ఒత్తిడి పెరుగుతుందని పోడియాట్రిస్టులు (Foot specialists) హెచ్చరిస్తున్నారు. ఇంకా ఏయే ప్రాబ్లం తలెత్తుతాయో చూద్దాం.

*హై హీల్స్ సాధారణ నడకను డిస్టర్బ్ చేస్తాయి. శరీర బరువు ముందు పాదాల(Tow box)పై పడటంతో బ్యాలెన్స్ తప్పుతుంది. దీంతో ఆ భాగంలో గడ్డలు లేదా పుండ్లు ఏర్పడతాయి. నరాలవాపు, అకిల్లీస్ టెండినైటిస్ (Achilles tendon inflammation), పాదాల అడుగు భాగంలో నిప్పి (Plantar fasciitis), ఎముకల్లో చిన్న చిన్న పగుళ్లు (Stress fractures) ఏర్పడతాయి.

*అధ్యయనాల ప్రకారం.. రోజూ హై హీల్స్ ధరించే మహిళల్లో 70% మందికి పాదాల సమస్య లేదా నరాల సమస్యతో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ. అంతేకాకుండా పాదాల ముందు భాగంలోని బోన్స్ డిఫార్మ్ అవుతాయి. పెద్దవేలు వంపు తిరిగి(బునియన్స్) నొప్పి కలుగుతుంది. ఇక దీర్ఘకాలికంగా హైహీల్స్ వేసేవారిలో మోకాళ్ల నొప్పి, వెన్ను నొప్పి కూడా వస్తాయి. ఎందుకంటే హై హీల్స్ ధరించడంవల్ల నడకలో పోస్చర్ మారుతుంది. అలాగే స్పైనల్ అలైన్‌మెంట్ కూడా తప్పుతుంది. కాబట్టి 2 ఇంచుల కంటే తక్కువ చంకీ హీల్స్ (వెడల్పు హీల్స్) ఉన్న వాటిని ఎంచుకుంటే బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు.

Next Story