గులాబీ వాసనతో మెదడు పనితీరులో మార్పు! 30 రోజులు దుస్తులపై రాస్తే.. పెరుగుతున్న గ్రే మ్యాటర్ !

by Javid Pasha |

గులాబీ ఆయిల్ నుండి వచ్చే సుగంధ అణువులను పీల్చినప్పుడు, అవి ఆల్ఫాక్టరీ సిస్టమ్ ద్వారా నేరుగా మెదడుకు లింక్ అయి ఉండే లింబిక్ సిస్టమ్‌కు చేరతాయి.

గులాబీ వాసనతో మెదడు పనితీరులో మార్పు! 30 రోజులు దుస్తులపై రాస్తే.. పెరుగుతున్న గ్రే మ్యాటర్ !
X

దిశ, ఫీచర్స్ : కొన్ని సరకాల సహజ సిద్ధమైన సువాసనలు సహజంగానే మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి. సానుకూల ఆలోచనలను ప్రేరేపిస్తాయి. అయితే తాజా అధ్యయనం మరో కొత్త విషయాన్ని వెల్లడించింది. ఏంటంటే.. 30 రోజుల పాటు గులాబీ ఎసెన్షియల్ ఆయిల్‌ను 1-2 చుక్కలు క్యారియర్ ఆయిల్‌లో కలిపి స్వల్పంగా రాసిన దుస్తులను ధరించడం వల్ల మెదడు పనితీరులో మార్పు కనిపించింది. స్టడీలో భాగంగా ఈ ఆయిల్‌ను ఉపయోగించిన వారి బ్రెయిన్ MRI స్కాన్‌లను పరిశీలించగా గ్రే మ్యాటర్ వాల్యూమ్‌లో గణనీయమైన పెరుగుదల కనిపించినట్లు పరిశోధకులు పేర్కొన్నారు. ఇంకా ఏయే బెనిఫిట్స్ ఉంటాయో చూద్దాం.

గులాబీ ఆయిల్ నుండి వచ్చే సుగంధ అణువులను పీల్చినప్పుడు, అవి ఆల్ఫాక్టరీ సిస్టమ్ ద్వారా నేరుగా మెదడుకు లింక్ అయి ఉండే లింబిక్ సిస్టమ్‌కు చేరతాయి. నిజానికి ఈ మెదడు భాగం భావోద్వేగాలు, జ్ఞాపకాలు, ప్రవర్తనల నియంత్రణ కేంద్రంగా పేర్కొంటారు. అంటే అధ్యయనం ప్రకారం జ్ఞాపకాల ప్రాసెసింగ్‌(memory processing)కు కీలకమైన పోస్టీరియర్ సింగ్యులేట్ కార్టెక్స్ (PCC) ప్రాంతం ఈ వాసనకు ప్రత్యేకంగా స్పందిస్తుంది. అంతేకాకుండా గులాబీల సుగంధ పరిమళం మెమరీ సంబంధిత న్యూరల్ మార్గాలను యాక్టివేట్ చేయడం ద్వారా న్యూరోప్లాస్టిసిటీని ప్రోత్సహిస్తుంది. ఇది సానుకూల ఆలోచనలకు దారితీస్తుంది. జ్ఞాపక శక్తిని పెంచుతుంది. అంతే కాకుండా మెరుగైన భావోద్వేగ సమతుల్యతకు దోహదం చేస్తుంది. కార్టిసాల్ హార్మోన్ స్థాయిని తగ్గించి ఒత్తిడిని దూరం చేస్తుంది. మొత్తం మానసిక ఆరోగ్య శ్రేయస్సుకు దోహదం చేస్తుంది.

గులాబీ ఆయిల్ సువాసనలు మెదడు కొత్త కనెక్షన్లను ఏర్పర్చుకోవడానికి ప్రేరణగా నిలుస్తుంది. తద్వారా డెమెన్షియా, ఆల్జీమర్ వంటి వ్యాధుల రిస్క్ తగ్గుతుంది. ఏకాగ్ర, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. 1-2 చుక్కలు క్యారియర్ ఆయిల్‌లో కలిపి దుస్తుల కాలర్/స్లీవ్‌పై రాస్తే చాలు. దాని ప్రభావం రోజంతా పనిచేస్తుంది. అయితే దీనిని చర్మంపై నేరుగా రాయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. కొందరికి అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా మీకు సువాసనలు పడతాయో లేదో అనే దానిని బట్టి గులాబీ ఎసెన్షియల్ ఆయిల్ వాడాలో లేదో డిసైడ్ చేసుకోవడం బెటర్.

Next Story