- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైట్ తక్కువ ఉన్న అమ్మాయిల్ని ఏడిపించకండి.. వాళ్లలో ఈ స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయండోయ్
ప్రాచీన సాముద్రిక శాస్త్రం ప్రకారం శరీరాకృతి ద్వారా కూడా మనిషి గుణగణాలు తెలుసుకోవచ్చని నమ్మకం ఉంది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రాచీన సాముద్రిక శాస్త్రం ప్రకారం శరీరాకృతి ద్వారా కూడా మనిషి గుణగణాలు తెలుసుకోవచ్చని నమ్మకం ఉంది. ఈ సిద్ధాంతం ప్రకారం, పొట్టిగా ఉన్న వ్యక్తులు ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో పాటు mentallu & physically స్థిరంగా ఉంటారని చెబుతారు.
1. ఆత్మవిశ్వాసం ఎక్కువ
పొట్టి అమ్మాయిలు తమపట్ల నమ్మకం ఎక్కువగా కలిగి ఉంటారు. ఏ పని చేయగలమనే దృఢతతో ముందుకు సాగుతారు. వారిలో ఆశావాదం ఎక్కువగా ఉంటుంది.
2. తెలివి & వాక్ చాతుర్యం
వారు పరిస్థులను త్వరగా అర్థం చేసుకుంటారు. తమ మాటలతో ఇతరులను ఆకట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటారు. అందువల్ల ఏ రంగంలోనైనా రాణించగలుగుతారు.
3. గట్టితనంతో ముందుకు సాగేవారు
ఈ వ్యక్తులు శారీరకంగా, మానసికంగా గట్టిగా ఉంటారు. సంక్షోభ సమయంలో నిబ్బరంగా వ్యవహరిస్తారు. “పొట్టి వారు గట్టి వారు” అన్న సామెత ఇందుకు సరైన ఉదాహరణ.
4. బంధాలను విలువగా చూస్తారు
పొట్టి అమ్మాయిలు కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారు. వారు పెళ్లి తరువాత తమ భాగస్వామిపై అపారమైన ప్రేమను చూపుతారు. దాంతో పాటు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు.
5. ఉన్నత స్థాయికి ఎదుగుతారు
చదుపు పట్ల మక్కువ ఎక్కువగా ఉండటం వల్ల వీరు జీవితంలో గౌరవనీయమైన స్థాయికి చేరతారు. సులభంగా కొత్త విషయాలను అర్థం చేసుకునే సామర్థ్యం కూడా వారిలో ఉంటుంది.
ఈ విశేషాలు శాస్త్రపరంగా నిరూపించబడ్డవే కాదు. కానీ అనుభవజ్ఞుల అభిప్రాయంగా ప్రచారం అవుతున్న విశ్వాసాలపై ఆధారపడినవి. అయితే.. వ్యక్తిత్వాన్ని నిర్ణయించేది ఒక్క శరీరాకృతి కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.






