Burnout : ఏడాదికి మూడు సార్లు ఇలా చేస్తే చాలు.. ఆ రిస్క్ 50% తగ్గినట్లే..!

by Javid Pasha |   (  Updated:2025-04-18 06:40:00  IST  )

Burnout : ఏడాదికి మూడు సార్లు ఇలా చేస్తే చాలు.. ఆ రిస్క్ 50% తగ్గినట్లే..!

Burnout : ఏడాదికి మూడు సార్లు ఇలా చేస్తే చాలు.. ఆ రిస్క్ 50% తగ్గినట్లే..!
X

దిశ, ఫీచర్స్ : అధిక పని ఒత్తిడితో అవస్థలు పడుతున్నారా? మానసిక, భావోద్వేగ, శారీరక అలసట వేధిస్తున్నాయా? ‘అయితే మీరు వెంటనే ఇష్టమైన ప్రాంతానికి ట్రిప్ ప్లాన్ చేసుకోండి. నచ్చిన ప్రాంతానికి వెళ్లి కొన్ని రోజులు గడిపి రండి’ అంటున్నారు మానసిక నిపుణులు. ఎందుకంటే కొత్త ప్రదేశాలకు ప్రయాణించడంవల్ల బర్న్ అవుట్ (Burnout)సమస్య 50% వరకు తగ్గుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. దీర్ఘకాలిక ఒత్తిడితో ఇబ్బంది పడేవారికి ఇది టానిక్‌లా పనిచేస్తుందని తెలిపింది. ఏడాకిది కనీసం మూడు కొత్త ప్రదేశాలకైనా వెళ్లి వచ్చేవారికి బర్న్ అవుట్ రిస్క్ ఉండదని పేర్కొన్నది.

యూఎస్ (US)నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్‌(National Center for Biotechnology Information)కు చెందిన పరిశోధకులు మానసిక రుగ్మతలపై అనేక సంవత్సరాలుగా పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో వారు ఇటీవల కొత్త ప్రదేశాలకు ప్రయాణించడం, అక్కడ గడపడం దీర్ఘకాలిక మానసిక ఒత్తిడిని తగ్గిస్తుందని, బర్న్ అవుట్ సమస్యకు చెక్ పెడుతుందని గుర్తించారు. అధ్యయనంలో భాగంగా 2016లో ఒకసారి, తాజాగా మరోసారి పరిశోధకులు 2500 మందిని అబ్జర్వ్ చేశారు. వీరిలో అధిక పని ఒత్తిడి, దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల తరచూ బర్న్ అవుట్‌ (Burnout) సమస్యను ఎదుర్కొనేవారు 1600 మందికిపైగా ఉండగా.. వారు కొత్త ప్రదేశాలకు ప్రయాణించడం, ఏడాదిలో కనీసం మూడుసార్లు కొత్త దేశాలకు ట్రిప్‌కు వెళ్లి రావడం కారణంగానే వారిలో బర్న్ అవుట్ సమస్య 50 శాతం తగ్గించిందని పరిశోధకులు కనుగొన్నారు. ఇది మానసిక శ్రేయస్సుకు ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు.

Next Story