- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏం నాయనా.. పుదుచ్ఛేరిని కూడా గోవాలా మార్చేద్దామనుకుంటున్నారా.?
పుదుచ్చేరిని కూడా "గోవా" మార్చేట్లుంది ఈ యూత్.

లైఫ్‌లో ఒక్కసారైనా "గోవా పోవాలె"..
అనే ఫీలింగ్ యూత్‌ది.
చిల్ అవొచ్చు.. థ్రిల్ కావచ్చు అనుకుంటారు.
ఆ సౌకర్యాలూ ఉంటాయి.
"మేం గోవా పోతున్నం" అని పెద్దొళ్లు ఎవరైనా అంటే..
"ఏంటి అంకుల్ మీరు గోవావెళ్లి ఏం చేస్తారు" అనేంత వింతగా మారిపోయింది గోవా.
పుదుచ్చేరిని కూడా "గోవా" మార్చేట్లుంది ఈ యూత్.
- దిశ, ఫీచర్స్
బంగాళాఖాతం తీరంలో.. తమిళనాడు రాష్ట్రంలో దాగివున్న ఒక చిన్న యూనియన టెరిటరీ ఈ పుదుచ్చేరి. పర్యాటకులకు ఇదొక అద్భుతమైన గమ్యస్థానం. సాంస్కృతిక.. ఆధ్యాత్మిక.. పర్యాటక విలువలున్న పుదుచ్చేరిని మరో గోవాగా మార్చేస్తోంది ఇన్‌స్టాగ్రామ్ జాతర.
ఇన్‌స్టా జాతర..
ఫ్రెంచ్ వలస సంస్కృతి.. తమిళ సంప్రదాయం.. ఆధ్మాత్మిక శాంతి సమ్మేళనంతో ప్రతీ సందర్శకుడికి పుదుచ్చేరి ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని్స్తుంది. ఒకప్పుడు ఫ్రెంచ్ కాలనీగా ఉన్న పుదుచ్చేరి.. ఇప్పటికీ దాని యూరోపియన్ వారసత్వాన్ని వీధుల్లో.. నిర్మాణాల్లో.. వంటకాల్లో ప్రతిబింబిస్తోంది. అయితే ఈ మధ్య సోషల్ మీడియా పుణ్యాన ఇదొక సెల్పీల కేంద్రమైపోతోందని పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడి సంస్కృతి.. సంప్రదాయాలను.. ఆధ్మాత్మిక ఆనందాన్ని పొందడం కంటే ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు పెట్టడానికే పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారట. ఇది "పుదుచ్చేరీ పర్యాటకమా" లేక "ఇన్‌స్టా జాతరనా" అనేలా ఉందట పరిస్థితి.
నాడు చూడముచ్చట..
ఒకప్పుడు పుదుచ్చేరి పర్యాటకాన్ని ఆస్వాదించాలంటే పెద్దగా ఖర్చయ్యేది కాదు. రాతిరోడ్లు.. స్వచ్చమైన సముద్ర తీరాలు.. వీధి దుకాణాలు చూడముచ్చటగా ఉండేవి. సముద్ర ఆహారం వడ్డించే ఆకర్షణీయమైన కేఫ్‌లలో భోజనం.. కాఫీలను ఆస్వాదించేవాళ్లు. అక్కడి వాస్తు కళను చూసి అబ్బురపడిపోయేవాళ్లు. రొమైన్ రోలాండ్ వీధిలో 1774 నాటి కలనీ బంగ్లాలో ఉన్న క్లూనీ ఎంబ్రాయిడరీ.. ఇక్కడ వితంతువులు.. గృహహింస నుంచి బయటపడిన మహిలు.. జంతువులు.. పక్షులు.. పూలు.. సాంస్కృతిక చిహ్నాలను నాప్‌కిన్ సెట్లు.. టేబుల్ క్లాత్‌లపై అల్లే విధానం ఆకట్టుకునేది. ఈ బంగ్లా ఒకప్పుడు ఫ్రెంచ్ కౌన్సిలర్ లాగ్రెనీ డి మెజియర్స్‌ది.
ఏది ఆ స్వచ్ఛత.?
పుదుచ్చేరి ఇప్పటికీ ఫ్రెంచ్.. డచ్.. బ్రిటీష్ సాంస్కృతిక ప్రభావాలతో కలనీ శైలిని కాపాడుకుంటోంది. కానీ ఇదొక ఇన్‌స్టా గమ్యంగా మారింది. కనిపించాలి.. పుదుచ్చేరి వచ్చామని చెప్పుకోవాలి.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలి అనేదానికే ప్రయారిటీ ఇస్తున్నారు. ఇప్పుడు పుదుచ్చేరిలో కనిపించే రద్దీ అంతా ఇదే. ఈ కారణంగా అనేక ప్రదేశాల స్వచ్చత.. పవిత్రత కోల్పోతున్నాయని అంటున్నారు స్థానికులు. ఈలలు.. కేకలు.. ఫొటోలతో కిక్కిరిసిపోతున్నారు. శుభ్రత లోపిస్తోంది. రంగుల నిర్మాణాలను గంటల తరబడి తిలకించినవాళ్లు.. వాస్తు శిల్పాన్ని చూసి అబ్బురపడినవాళ్లు.. ఇప్పటి సెల్పీల పిచ్చి.. ఆటో రిక్షాల రద్దీని చూసి కలవరపడుతున్నారు.
సేవ్ పుదుచ్చేరి
పుదుచ్చేరి ఆకర్షణలు అన్వేషించడానికి విలువైనవి. సెరెనిటీ బీచ్.. శరీ అరవిందో ఆశ్రమం.. సేక్రెడ్ హార్ట్ బసిలికా వంటి ప్రసిద్ధ ప్రదేశాలతో పాటు ఇంకా చాలా ఉన్నాయి చూడాల్సినవి. గతంలో వీటన్నింటినీ ఆస్వాదిస్తూ ప్రశాంతతకు గమ్యస్థానంగా ఫీలయ్యేవాళ్లు. ఇప్పటి పర్యాటక రద్దీ.. వాణిజ్యీకరణ వల్ల దాని సహజ ఆకర్షణ తగ్గింది. స్థానికులు సుస్థిర పర్యాటకాన్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నారు. సందర్శకులు స్థానిక సంస్కృతిని గౌరవించడం.. పర్యావరణాన్ని కాపాడటం.. స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించడం ద్వారా పుదుచ్చేరి అందాలను భావి తరాలకు భద్రపరచవచ్చు. లేదంటే మరో గోవా అయిపోతుంది.






