ఇలా పడుకుంటే ప్రశాంతమైన నిద్ర.. ఆ సమస్యలకు కూడా చెక్!

by velandi.Saikiran |

అలా ప‌డుకుంటే, గుండెకు రక్త సరఫరా బాగా జరుగుతుందని చెబుతున్నారు. దానివల్ల గుండె

sleep
X

sleep

దిశ‌, వెబ్ డెస్క్‌: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మన పెద్దలు. కానీ ఇప్పటి కాలంలో ఉన్న జనాలు ఆరోగ్యం పట్ల ఏ మాత్రం శ్రద్ధ చూపించరు. వద్దన్నదే చేసి చూపిస్తారు. దాంతో అనారోగ్యం పాలు అవుతున్నారు చాలా మంది. ఇక కొంత మంది సరిగ్గా నిద్ర లేక రోగాల బారిన పడుతున్నారు. ఒత్తిడి, ఇతర సమస్యల కారణంగా చాలా మందికి సరిగ్గా నిద్ర పట్టదు. అయితే, ప్రశాంతమైన నిద్ర పట్టేందుకు కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి సమయంలో ప్రశాంతమైన నిద్ర రావాలంటే, ఎడమవైపు పడుకుంటే మంచిదని చెబుతున్నారు. బోర్లా, వెల్లకిలా కంటే ఎడమ వైపు పడుకుంటే గాఢమైన నిద్ర వస్తుందని స్పష్టం చేస్తున్నారు వైద్యులు.

అలా ప‌డుకుంటే, గుండెకు రక్త సరఫరా బాగా జరుగుతుందని చెబుతున్నారు. దానివల్ల గుండె పోట్లు రావట. జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుందట. తద్వారా గ్యాస్ తో పాటు మలబద్ధక సమస్యకు కూడా చెక్ పెట్టవచ్చు. ఎడమ వైపు పడుకుంటే శ్వాసలో ఇబ్బందులు, గురక లాంటి సమస్యలు దూరమవుతాయట. ఎక్కువ సేపు బోర్లా పడుకుంటే, నడుము నొప్పి, శ్వాస సమస్యలతో పాటు మెడనొప్పి కచ్చితంగా వస్తాయని వార్నింగ్ ఇస్తున్నారు వైద్యులు. దిండు పెట్టుకునే వాళ్లు, మృదువుగా మెత్తగా ఉండే పిల్లో వాడితే సరిపోతుందట. పైన పేర్కొన్న టిప్స్ పాటిస్తే ఘనమైన నిద్ర వస్తుందట.

Next Story