పచ్చి టమాటాలతో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు!

by Disha Web Desk 10 |
పచ్చి టమాటాలతో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు!
X

దిశ, ఫీచర్స్: టమాటోని.. కూరల దగ్గర నుంచి సలాడ్‌ల వరకు, శాండ్‌విచ్‌ల నుండి బిర్యానీ వరకు వాడతారు. మనలో చాలామంది పండిన టొమాటోలను పంచదార కలిపి తినడానికి ఇష్టపడతారు. టమోటాలు చాలా ఆరోగ్యకరమైనవని మనకు తెలుసు. అయితే పచ్చి టమోటాలు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని అందరికి తెలీదు.

పచ్చి టమోటాలు తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ టొమాటోలో కాల్షియం, పొటాషియం, విటమిన్ సి, ఎ వంటి ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి మన శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. ఇందులో ఉండే క్యాల్షియం మన ఎముకలను దృఢపరుస్తుంది. అందుకే పచ్చి టమాటాలను అప్పుడప్పుడు చిన్నపిల్లలకు తినిపిస్తే.. స్ట్రాంగ్ గా తయారవుతారు.

గ్రీన్ టమాటోలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి. అంతే కాకుండా, ఈ టమోటాలు క్యాన్సర్ సంబంధిత కణాలను నిరోధించడంలో కూడా సహాయపడతాయి. అధిక రక్తపోటు ఉన్నవారు ఈ ఆహారాన్ని తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. సీజనల్ వ్యాధుల నుంచి మనల్ని కాపాడుకోవడానికి పచ్చి టమాటాలు ఎంతగానో ఉపయోగపడతాయి.


Next Story

Most Viewed