మీ జుట్టు నల్లగా, అందంగా నిగనిగలాడాలంటే.. ఇలా చిటికెలో చేయొచ్చు..

by Disha Web Desk 20 |
మీ జుట్టు నల్లగా, అందంగా నిగనిగలాడాలంటే.. ఇలా చిటికెలో చేయొచ్చు..
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ మధ్య కాలంలో చాలా మంది యువతకు వస్తున్న అతి పెద్ద సమస్య జుట్టు రాలిపోవడం. వాతావరణంలో మార్పుల వల్లనో, కాలుష్యం వల్లనో లేదా అధికఒత్తిడి వల్లనో ఈ సమస్య ఎక్కువవుతుంది. అయితే ఇలాంటి సమస్యలు వచ్చినపుడు డాక్టర్ ని సంప్రదించో లేదా మార్కెట్ లో దొరికే షాంపూలను ఉపయోగించో తగ్గించుకుందాం అనుకుంటారు. కానీ దానికి మరో మార్గం ఉందని ఆలోచించరు.

కొన్ని ఆహార అలవాట్లను మార్చుకుంటే వారి సమస్యలను అధిగమించొచ్చు అని తెలుసుకోరు. ఎప్పుడైతే మానవ శరీరానికి విటమిన్లు, మినరల్స్ వంటివి నాచురల్ గా అందుతాయో ఎలాంటి సమస్యలు రావు. దాంతో జుట్టుకూడా అందంగా ఆరోగ్యంగా పెరుగుతుంది. అయితే జుట్టు కోసం కూడా కొన్ని రకాల ఆహార పదార్ధాలు ఎంతో ఉపయోగపడతాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జాజికాయ : జాజికాయ జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. రాత్రిపూట పడుకునే ముందు పాలలో జాజికాయ పొడిని, ఆలీవ్ గింజలను కలిపి తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇలా కలిపి తీసుకోవడం వల్ల జుట్టు దృఢంగా, ఊడిపోకుండా సహాయ పడుతుందని డాక్టర్స్ చెబుతున్నారు.

మెంతులు : వంటగదిలో ఉండే మెంతులు డయాబిట్ పేషంట్లకు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ఓ గొప్ప సంజీవని. తినే ఆహారంలో ఎక్కువగా మెంతును ఉపయోగిస్తే అది హార్మోన్ల సమస్యలను తగ్గించి ఆరోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది. అంతే కాదు జుట్టు ఊడిపోయేవారికి కూడా మేలు చేస్తుంది. మెంతులను కొబ్బరి నూనెలో వేసి వేడి చేసుకుని, అది చల్లారిన తర్వాత జుట్టుకు పట్టించి మసాజ్ చేయాలి.

తరువాత ఒక రాత్రంతా ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే జుట్టు ఎంతో అందంగా పెరుగుతుంది. తలస్నానం చేయడం వీలు కాని వారు అలాగే ఉంచుకున్న పర్వాలేదని నిపుణులు చెపుతున్నారు.

ఆలివ్ సీడ్స్: ఆలివ్ సీడ్స్ ని ఉదయం నీటిలో నానబెట్టుకుని రాత్రి పడుకునే ముందు పాలతో తీసుకోవాలి. పాలలో తీసుకోవడం ఇష్టంలేని వారు ఆలివ్ సీడ్స్ కొబ్బరి, ఇతర డ్రై ఫ్రూట్స్, నెయ్యి వేసి వాటిని మిక్సీ పట్టి లడ్డూలు తయారు చేసుకొని తినొచ్చు. ఈ సీడ్స్ ద్వారా ఐరన్ పుష్కలంగా అంది జుట్టు ధృడంగా పెరుగుతుంది.

ఇవి మాత్రమే కాకుండా నెయ్యిలో ఉండేటువంటి కొవ్వు పదార్థాలు, పెరుగు ఉండే ప్రోబయోటిక్స్ బ్యాక్టీరియా, కాల్షియం, విటమిన్ డీ, ఎన్నో రకాల మినరల్స్ పుష్కలంగా అందించి జుట్టు పెరగడానికి ఉపయోగపడతాయి


Next Story

Most Viewed