- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉద్యోగంలో ఎదగాలంటే ఇవి తప్పనిసరి..!
ఉద్యోగం అనేది ఆర్థిక భరోసాను అందించడమే కాకుండా.. సమాజంలో హోదాను ఇస్తుంది.

దిశ, ఫీచర్స్: ఉద్యోగం అనేది ఆర్థిక భరోసాను అందించడమే కాకుండా.. సమాజంలో హోదాను ఇస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అలా అని ఎప్పటికీ అక్కడే ఉండిపోతే.. విజయం సాధించడంలో వెనుకడుగు వేసినట్లే. ఉద్యోగంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే కొన్ని విషయాలను తప్పక తెలుసుకోవాలంటున్నారు నిపుణులు. మరి అలాంటి విషయాలేంటో ఒప్పుడు తెలుసుకుందాం.
* చదువులోనే కాదు ఉద్యోగంలో కూడా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. దానిని చేరడం కోసం కృషి చేయాలి. అప్పుడే దీనిపై జీవితంపై స్పష్టత వస్తుంది. ఈ విషయంలో ఏమైనా ఆటంకాలు ఏర్పడితే, నిరాశ చెందకుండా వాటిని అధిగమించాలి.
* తోటి ఉద్యోగులు లేదా అధికారుల విషయంలో ఏదైనా అసంతృప్తి ఉంటే.. ఆ విషయాలు గురించి ఇతరులతో ఎప్పుడూ చర్చించకూడదు. అవి మీ మీద అభిప్రాయాన్ని మార్చివేస్తాయి.
* ఎటువంటి రంగంలోనైనా ప్రోత్సహించే వారితో పాటుగా నిరుత్సాహపరిచే వారు కూడా ఉంటారు. అటువంటి వారిని ఎప్పటికీ పట్టించుకోకూడదు. వారిపై కోపాన్ని పెంచుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. అందుకే వారి పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది.
* మీ సహోద్యోగులు మీలాగే ఉండాలని అనుకోకండి. మంచి చెప్పినా సరే పెడర్థాలు తీసే వారు కొందరు ఉంటారు. వారి పట్ల జాగ్రత్త వహించండి. మీ వరకు మీరు సక్రమంగా ఎంత పని చేయగలరో అంతే చేయండి. ఆ పనిని చేయడానికి ఒక ప్రణాళికను ఏర్పరుచుకోండి. ఎప్పటికప్పుడూ కొత్తగా ఏం చేయాలి? ఎలా చేయాలి అనే విషయం గురించి ఆలోచించండి.
* చేసే పనిలో కష్టపడుతున్నా సరే.. ఒక్కోసారి ఆశించినంత ఫలితం రాదు. కొన్ని సందర్భాల్లో ఆటంకాలు ఎదురవ్వొచ్చు. అలా అని నిరాశ చెందాల్సిన అవసరం లేదు. తెలివిగా వాటిని దాటుకుంటూ ముందుకు సాగాలి. ఇది ఉద్యోగం విషంలోనే కాదు మరేవిషయంలోనైనా ఇలాగే చేయాలి.
* మీ కొలిగ్స్‌తో విభేధాలు వస్తే, ఆ విషయాన్ని వారితో చర్చించి పరిష్కరించుకోండి. అంతేకాని వారిపై కోపం పెంచుకోవడం లేదా ఉద్యోగాన్ని వదిలేయడం వంటి నిర్ణాయాలు తీసుకోవడం మంచిది కాదు.
* చేసే పనిలో ఇష్టం లేనప్పుడు అది భారంగా అనిపిస్తుంది. దానిపై ధ్యాస తగ్గుతుంది. ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయవచ్చు. అందుకే ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ పనిలో సులవైన మార్గాలను ఎంచుకోవాలి. పనిని సులభంగా చేసే అంశాలను కనిపెట్టాలి.






