ఆయన పేరు మీదే 'సతీష్ ధావన్ అంతరిక్ష' కేంద్రం

by Disha Web Desk 7 |
ఆయన పేరు మీదే సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం
X

దిశ, ఫీచర్స్: భారతీయ ఏరోస్పేస్ ఇంజనీర్ సతీష్ ధావన్ సెప్టెంబరు 25 జన్మించాడు. ఆయనను భారత 'ఎక్స్‌‌పరిమెంటల్ ఫ్లూయిడ్ డైనమిక్స్‌'కు పితామహుడిగా పరిగణిస్తారు. శ్రీనగర్‌కు చెందిన ధావన్‌ను టర్బులెన్స్, బౌండరీ లేయర్స్ రంగాల్లోనూ అత్యున్నత స్థాయి పరిశోధకుల్లో ఒకరిగా పరిగణిస్తారు. ఈ రంగాల్లో ఆయన శక్తి సామర్థ్యాలు, భారత స్వదేశీ అంతరిక్ష కార్యక్రమ అభివృద్ధికి దోహదపడింది. 1972లో ఎమ్.జి.కె. మీనన్ తర్వాత ఇస్రో చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సతీష్.. స్పేస్ కమిషన్‌కు, భారత ప్రభుత్వ అంతరిక్ష శాఖలో సెక్రెటరీగా బాధ్యతలు నిర్వర్తించాడు. ఆ తర్వాత అణుశక్తి కమిషన్‌లో ఉన్న 'బ్రహ్మ ప్రకాష్‌', తిరువనంతపురంలో ఉన్న 'విక్రం సారాభాయ్ అంతరిక్ష కేంద్రం' చైర్మన్‌గా నియమించబడ్డాడు.

ఇస్రో శీఘ్రగతిన ఎదగడానికి ఈ చర్య ఎంతో తోడ్పడింది. ఆ తర్వాత భారత తొలి ఉపగ్రహ వాహక నౌక 'ఎస్‌ఎల్‌వి' అభివృద్ధి కార్యక్రమానికి అబ్దుల్‌కలాంను నాయకుడిగా నియమించగా.. 1975లో అబ్దుల్ కలామ్ నాయకత్వంలో 'ఎస్‌ఎల్‌వి' మొదటి ప్రయోగం విఫలమైంది. అయితే ఆ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ఆనాటి పత్రికా సమావేశంలో పాల్గొని విఫల ప్రయోగాన్ని తనపైనే వేసుకున్నాడు. రెండవ ప్రయోగం విజయవంతమైనపుడు మాత్రం పత్రికా సమావేశానికి అబ్దుల్ కలాంను పంపిచడం విశేషం. సతీష్ ధావన్ చేసిన పరిశోధనలను హెర్మన్ ష్లిక్టింగ్ తను రాసిన 'బౌండరీ లేయర్ థియరీ' పుస్తకంలో వివరించాడు. అంతేకాదు 'ఐఐఎస్‌సి'లో భారతదేశపు మొట్టమొదటి 'సూపర్‌సోనిక్ విండ్ టన్నెల్‌'ను నిర్మించగా.. ధావన్ కృషికిగానూ 1999లో 'ఇందిరా గాంధీ జాతీయ సమైక్యతా పురస్కారం'తోపాటు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రానికి 'సతీష్ ధావన్ అంతరిక్ష' కేంద్రంగా పేరు పెట్టారు. లూథియానాలోని ప్రభుత్వ కళాశాలకు ఆయన పేరు పెట్టారు.


Next Story

Most Viewed