- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral : పెంగ్విన్ ప్రేమ కథ.. బ్రేకప్ బాధలో మరణం వైపు?
ఆడ పెంగ్విన్ మోసం చేస్తే మగ పెంగ్విన్ తట్టుకోలేదు. అప్పుడది తన సమూహాన్ని వదిలేసి దూరంగా వెళ్లిపోయి.. ఒంటరిగా మరణిస్తుంది!

దిశ, ఫీచర్స్ : మీరు చూసే ఉంటారు బహుశా.. సముద్రాన్ని, సమూహాన్ని వదిలి అకస్మాత్తుగా మంచు పర్వతం వైపు ఒంటరిగా వెళ్తున్న ఒక పెంగ్విన్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది చూసి నెటిజన్లు చాలామంది భావోద్వేగానికి లోనవుతున్నారు. తమ జీవితాలను పోల్చుకుంటున్నారు. పర్పస్ లేని జీవితం.. ప్రేమలో వైఫల్యం గురించి చర్చిస్తున్నారు. ‘ప్రేమలో ఒక్కసారి మోసం చేస్తే భరించలేక మరణం వైపు నడిచే పెంగ్విన్’ అనే హాష్ ట్యాగ్‌లతో ఎమోషనల్ స్టోరీలను షేర్ చేస్తున్నారు. టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పెంగ్విన్ గురించి గతంలో చెప్పిన లవ్ అండ్ బ్రేకప్ స్టోరీని సైతం వైరల్ వీడియోకు జోడిస్తున్నారు. మొత్తానికి పెంగ్విన్ ప్రేమ కథ నెటిజన్లలో ఒక ఎమోషనల్ సెన్స్‌ను క్రియేట్ చేస్తున్నది. అద్భుతమైన సందేశాన్ని ఇస్తున్నది. యువ హృదయాలను టచ్ చేస్తున్నది.
ఒక్కసారి కమిటైతే..
ఒక మగ పెంగ్విన్ తాను ఇష్టపడిన ఆగ పెంగ్విన్‌కు ప్రపోజ్ చేసేందుకు సముద్రతీరంలో ఉండే ఒక అందమైన గులకరాయి(Pebble)ని తీసుకెళ్లి దాని ముందు ఉంచుతుంది. ఆడ పెంగ్విన్ దానిని టచ్ చేస్తే గనుక లవ్ యాక్సెప్ట్ చేసినట్టు. టచ్ చేయకపోతే తిరస్కరించినట్టు. తిరస్కరిస్తే ఎవరి దారి వారిది కానీ.. యాక్సెప్ట్ చేశాక ఒక్కసారి ప్రేమతో కమిట్ అయిన ఆ పెంగ్విన్ జంట జీవితాంతం కలిసే జీవిస్తుంది. విషయం ఏంటంటే.. అవి పరస్పరం మోసం చేసుకోవు. ముఖ్యంగా ఆడపెంగ్విన్ తాను కమిటైన మగ పెంగ్విన్‌తో తప్ప మరొక మగ పెంగ్విన్‌తో సన్నిహితంగా ఉండటానికి ఇష్టపడదు. ఒకవేళ అలా చేసిందంటే మోసం చేసినట్టు. చాలా వరకు అలా చేయదు. కానీ చేస్తే గనుక మగ పెంగ్విన్ తట్టుకోలేదట. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ చెప్పిన వెర్షన్ కూడా ఇదే.
ఒంటరిగా మరణం అంచులకు
‘ఒక్కసారి కమిటయ్యాక ఆడ పెంగ్విన్ నిరాకరించినా, మోసం చేసినా మగ పెంగ్విన్ ఆ బ్రేకప్ బాధను తట్టుకోలేదు. దీంతో అది తన నివాసమైన సముద్రాన్ని, తాను కలిసి ఉండే పెంగ్విన్ సమూహాన్ని వదిలేసి ఒంటరిగా అటు నుంచి దూరంగా వెళ్లిపోతుంది. ఆహారం దొరకని ప్రదేశానికి వెళ్లి బాధతతో, ఆకలితో కృంగి, కృశించి ఏకాకిగా నశించిపోతుంది.. పెంగ్విన్‌కి బ్రేకప్ అంటే ఇక డెత్ మాత్రమే. అంత ఆత్మాభిమానం దానికి’ అంటారు పూరీ జగన్నాథ్. ఆ వైరల్ స్టోరీలో. సైంటిఫిక్‌గా అయితే ఇది నిరూపితం కాలేదు. కానీ ఎమోషనల్, రొమాంటిక్ ఇంటర్‌ప్రెటేషన్‌తో కూడిన ఈ వైరల్ వీడియో నెటిజన్ల హృదయాలను టచ్ చేసింది. చాలామంది భావోద్వేగానికి లోనవుతూ పెంగ్విన్ స్టోరీలో తమను తాము దర్శించుకుంటున్నారు. పర్పస్ లేని లైఫ్ జీవించేకంటే ఈ పెంగ్విన్‌ను ఆదర్శంగా తీసుకోవాలని కొందరు. ఆత్మాభిమానం విషయంలో అదొక ప్రేరణ అని మరికొందరు. చీట్ చేసేవారికి ఇదొక గుణపాఠం నేర్పిందని ఇంకొందరు పేర్కొంటున్నారు. కాగా ఆ వైరల్ వీడియో 2007 సంవత్సరంలో అంటార్కిటికాలోని అడెలీ పెంగ్విన్ కాలనీలో వెర్నర్ హెర్జాగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘Encounters at the End of the World’ అనే డాక్యుమెంటరీలోని ఒక అద్భుతమైన, హృదయవిదారకమైన సన్నివేశం కాగా.. 2026లో వైరల్ అవుతూ ఎన్నో హృదయాలను కలచి వేస్తున్నది.






