- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దూరం.. ప్రేమను దగ్గర చేస్తుంది..!
లివింగ్ అపార్ట్ టుగెదర్ (Living Apart Together) అనేది వాస్తవానికి ప్రేమలో స్వేచ్ఛకు సంబంధించిన కొత్త ఒరవడిగా, రొమాంటిక్ సంబంధాల్లో కొత్త ధోరణిగా విస్తరిస్తోంది.

దిశ, ఫీచర్స్ : ఎప్పుడూ ఒకే ఇంట్లో, ఇంకే రూములో కలిసి నివసించిన జంటల మధ్యే ప్రేమ బలంగా ఉంటుందని, రొమాంటికల్ టచ్ బాగుంటుందని అనుకుంటారు కొందరు. కానీ అది మాత్రమే నిజం కాదంటున్నాయి ఆధునిక జంటలు. ఒకే ఇంటిలో ఉండి టైమ్ స్పెండ్ చేసుకున్నాక విడి విడిగా వేర్వేరు గదుల్లో నివసించేవారు, లేదా వేర్వేరు ఇండ్లల్లో, వేర్వేరు ప్రాంతాల్లో విడిగా నివసించేవారు కూడా అంతకు మించిన ప్రేమను, ఆనందాన్ని అనుభవిస్తున్నారని చెబుతున్నారు. దీనినే ‘‘లివింగ్ అపార్ట్ టుగెదర్” (LAT) ట్రెండ్‌గా పేర్కొంటున్నారు. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా జంటల మధ్య ఇది బాగా పెరిగిపోతోంది. ఇంతకీ దానివల్ల కలిగే బెనిఫిట్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.
బంధాన్ని బలోపేతం చేస్తుంది
లివింగ్ అపార్ట్ టుగెదర్ (Living Apart Together) అనేది వాస్తవానికి ప్రేమలో స్వేచ్ఛకు సంబంధించిన కొత్త ఒరవడిగా, రొమాంటిక్ సంబంధాల్లో కొత్త ధోరణిగా విస్తరిస్తోంది. ఈ ట్రెండ్ అసలు ఉద్దేశం భార్యా భర్తలు లేదా ప్రేమికులు దూరంగా ఉండటం కాదు. అవసరమైనప్పుడు మాత్రమే కలుసుకుంటూ మిగతా సమయంలో దూరంగా ఉంటూ పూర్తిగా దగ్గరయ్యే గొప్ప అనుబంధంగా నిపుణులు, దానిని అనుసరించేవారు పేర్కొంటున్నారు. అంటే ఇది పూర్తి అంకితభావంతో ఉంటూ, వేర్వేరు ఇండ్లల్లో నివసించే జంటల సరికొత్త శైలి అన్నమాట. ఒకప్పుడైతే.. ముఖ్యంగా సాంప్రదాయికంగా భార్యా భర్తలు లేదా సహజీవనం చేస్తున్న జంట ఒకే ఇంట్లో కలిసి ఉండటమే సంబంధానికి చిహ్నంగా భావించేవారు. కానీ ఇప్పుడు, ఈ LAT ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. ముఖ్యంగా 2025లో ఆధునిక జీవనశైలి, స్వేచ్ఛ, స్వయం సమృద్ధి(self-sufficiency), సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ లవ్, జెండర్ ఈక్వాలిటీ వంటి అంశాల పట్ల పెరిగిన ఆకర్షణ వల్ల దీనికి మరింత ఆదరణ లభిస్తోంది.
10 రెట్లు అధిక సంతోషంగా..
లివింగ్ అపార్ట్ టుగెదర్ ట్రెండ్‌ను ఎంతో మంది అనుసరిస్తున్నారు. హాలీవుడ్ నటి గ్వినెత్ పాల్ట్రో తన భర్త బ్రాడ్ ఫాల్చుక్‌తో వివాహం తర్వాత ఒక సంవత్సరం వారు వేర్వేరు ఇళ్లలో ఉన్నారు. ‘‘ఇది మనల్ని మిస్టరీగా ఉంచుతుంది. ప్రతీ సమయాన్ని ప్రత్యేకంగా మారుస్తుంది’ అని ఆమె పేర్కొన్నది. ఇక 2000 సంవత్సరం నుంచి 2022 వరకు, వివాహిత జంటల్లో ఈ లివింగ్ టుగెదర్ (LAT) ట్రెండ్‌ను అనుసరించేవారి40% పైగా పెరిగింది. ముఖ్యంగా 50 నుంచి 60 ఏండ్లు పైబడిన మహిళల్లో ఇది ఎక్కువగా ఉంటోంది. కెనడాలో 9% జంటలు దీనిని ఇష్టపడుతుండగా, యూకేలో 4 మిలియన్ల మంది ఇలాంటి సంబంధాల్లో ఉన్నారు. యూఎస్‌లో 50-64 సంవత్సరాల వయస్సు జంటల్లో 39% మంది ఉన్నారు. ఇది వృద్ధాప్యంలో మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని యూకే పరిశోధనలు చెబుతున్నాయి. పైగా దీనిని అనుసరిస్తున్న జంటలు సాంప్రదాయిక జంటల కంటే 10 రెట్లు ఎక్కువ సంతోషంగా ఉంటున్నారట.
భారత దేశంలో కూడా..
భారత దేశంలో ఇది తక్కువగా ఉన్నప్పటికీ ఢిల్లీ, బెంగుళూరు, ముంబై వంటి మెట్రో నగరాల్లో విస్తరిస్తోంది. ఎందుకంటే 60% దంపతులు శృంగారం, ఇతర విషయాలు మాట్లాడుకునే సందర్భంలో మినహాయించి మిగతా సమయాల్లో కలిసి ఒకే దగ్గర ఉండే సమయం ఉండటం లేదు. కెరీర్, చదువు, ఉద్యోగాలు, వ్యాపారాలు వంటి అంశాలపట్ల, ఆ తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి సమయాన్ని స్పెండ్ చేస్తున్నారు. ఇది కూడా దంపతులు విడిగా ఉండే లాట్ ట్రెండ్ పెరుగుదలకు దారితీస్తోంది. 2023లో మనిపాల్ యూనివర్సిటీ పరిశోధన ప్రకారం.. గ్లోబలైజేషన్ వల్ల భారతీయ దంపతుల్లో ఇది పెరిగింది. 2025లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సర్వే ప్రకారం 40% యువత LATకు అనుకూలంగా ఉన్నారు. Link






