మరీ ఇలాంటి సైకో భార్య ఉంటే నరకమే.. భర్త బయటకెళ్లొచ్చిన ప్రతి సారి ఆ పని చేయమంటే ఎలా? పైగా లై డిటెక్టర్ టెస్ట్.. స్టోరీ చదవాల్సిందే..

by Sujitha Rachapalli |

భర్తలపై భార్యలకు అనుమానం ఉండటం సాధారణమే కానీ మరీ ఈ లెవల్‌లో ఎవరినీ చూసి ఉండరు. అందుకే ఈమె ప్రపంచంలోనే మోస్ట్ జలస్‌ భార్యగా పిలవబడుతోంది. ఇంగ్లాండ్‌కు చెందిన డెబ్బీ వుడ్‌కు 52ఏళ్లు.. కానీ ఇప్పటికీ భర్త అంటే అత్యంత అనుమానం.

మరీ ఇలాంటి సైకో భార్య ఉంటే నరకమే.. భర్త బయటకెళ్లొచ్చిన ప్రతి సారి ఆ పని చేయమంటే ఎలా? పైగా లై డిటెక్టర్ టెస్ట్.. స్టోరీ చదవాల్సిందే..
X

దిశ, ఫీచర్స్ : భర్తలపై భార్యలకు అనుమానం ఉండటం సాధారణమే కానీ మరీ ఈ లెవల్‌లో ఎవరినీ చూసి ఉండరు. అందుకే ఈమె ప్రపంచంలోనే మోస్ట్ జలస్‌ భార్యగా పిలవబడుతోంది. ఇంగ్లాండ్‌కు చెందిన డెబ్బీ వుడ్‌కు 52ఏళ్లు.. కానీ ఇప్పటికీ భర్త అంటే అత్యంత అనుమానం. అందుకే ఆయన బయకు వెళ్లి ఇంటికి తిరిగొచ్చిన ప్రతీసారి లై డిటెక్టర్ టెస్ట్ చేస్తుంది. ఒప్పుకోకపోయినా బలవంతంగా ఒప్పిస్తుంది. ఆయన ఫోన్, ఈమెయిల్, సోషల్ మీడియా, బ్యాంక్ స్టేట్మెంట్స్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తూనే ఉంటుంది. టీవీలో మహిళలను చూస్తాడని షోస్ కూడా చూడకుండా అడ్డుకుంటుంది. ఈ అబ్‌నార్మల్ బిహేవియర్‌ భర్త వంచన చేస్తున్నాడని నమ్మకం నుంచి వస్తుండగా.. దీన్ని ఒథెల్లో సిండ్రోమ్‌గా నిర్ధారించారు నిపుణులు.

2011లో ఫేస్‌బుక్ ద్వారా స్టీవ్ వుడ్‌ను కలిసిన డెబ్బీ.. డేటింగ్ టైమ్‌లో అతన్ని పరీక్షించేందుకు నకిలీ ఫేస్‌బుక్ ఎకౌంట్ క్రియేట్ చేసింది. నమ్మకస్తుడని నిర్ధారించుకుంది. 2014లో హాలోవీన్ రోజున వివాహం చేసుకుంది. స్టీవ్ ఆమె కంటే 10-12 సంవత్సరాలు చిన్నవాడు. కాగా డెబ్బీకి ఇలాంటి అభద్రతాభావం గతంలోని బాధాకరమైన సంబంధాల నుంచి వచ్చాయి. ఆమె మునుపటి భాగస్వాములు ఆమెను మోసం చేయడంతో.. అనుమాన స్వభావాన్ని మరింత తీవ్రతరం చేసింది.

డెబ్బీ ఒథెల్లో సిండ్రోమ్‌తో పాటు బైపోలార్ డిజార్డర్, బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్, ఒబ్సెసివ్-కంపల్సివ్ డిజార్డర్ (OCD), ఆర్థరైటిస్, ఫేషియల్ పాల్సీ, స్కోలియోసిస్, ఫైబ్రోమైయాల్జియాతో బాధపడుతోంది. అధిక బరువు (133 కిలోలు) కారణంగా ఉద్యోగం చేయలేకపోతోంది. ప్రజలు తనను ఎగతాళి చేస్తారని బహిరంగంగా వ్యాయామం చేయడానికి భయపడుతోంది.

ఒథెల్లో సిండ్రోమ్ అంటే ఏమిటి?

ఒథెల్లో సిండ్రోమ్ అనేది ఒక అరుదైన మానసిక రుగ్మత. కాగా షేక్స్‌పియర్ నాటకం ‘ఒథెల్లో’లోని పాత్ర నుంచి పేరు పొందింది. ఈ నాటకంలో ఒథెల్లో తన భార్య డెస్డెమోనా విశ్వాసవంచన చేస్తోందని నమ్మి ఆమెను చంపాడు. భాగస్వామి విశ్వాసవంచన చేస్తున్నాడని ఎటువంటి ఆధారం లేకుండా నమ్మడం ఈ సిండ్రోమ్ ప్రధాన లక్షణం కాగా.. భాగస్వామి ఫోన్, ఇమెయిల్‌లు, సోషల్ మీడియా, ఆర్థిక లావాదేవీలను నిరంతరం తనిఖీ చేస్తుంటారు. రహస్యంగా మానిటర్ చేస్తారు. ఈ అనుమానాలు బాధితుడికి తీవ్రమైన ఆందోళన, డిప్రెషన్, సంబంధాలలో ఒత్తిడిని కలిగిస్తాయి. ఒథెల్లో సిండ్రోమ్ తరచుగా ఇతర మానసిక రుగ్మతలతో సంబంధం కలిగి ఉంటుంది. కొన్నిసార్లు మద్యపానం లేదా మాదక ద్రవ్యాల వాడకం దీనిని మరింత తీవ్రతరం చేస్తుంది.

Next Story