Textationship : నో టాకింగ్.. ఓన్లీ ఛాటింగ్.. Gen Zలో పెరిగిపోతున్న నయా ట్రెండ్

by Javid Pasha |

Textationship : నో టాకింగ్.. ఓన్లీ ఛాటింగ్.. Gen Zలో పెరిగిపోతున్న నయా ట్రెండ్

Textationship : నో టాకింగ్.. ఓన్లీ ఛాటింగ్.. Gen Zలో పెరిగిపోతున్న నయా ట్రెండ్
X

దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు ఏం మాట్లాడుకోవాలన్నా ప్రత్యక్షంగా కలుసుకోవాల్సిందే. దీనివల్ల దూరంగా.. వేరేచోట ఉండే వ్యక్తులతో రోజువారీ కమ్యూనికేషన్ సాధ్యం కాకపోయేది. కానీ సెల్‌ఫోన్ అందుబాటులోకి వచ్చాక ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జస్ట్ వన్ కాల్ దూరంలోనే అందరూ అందుబాటులో ఉంటున్నారు. అయితే మోడ్రన్ టెక్నాలజీ తెచ్చిన సరికొత్త మార్పులు, ముఖ్యంగా వాట్సాప్ అందుబాటులోకి రావడంతో ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడం కూడా ఇటీవల తగ్గుతోంది. ముఖ్యంగా Gen Zలో టెక్ట్సేషన్‌షిప్ (Textationship)ట్రెండ్ పెరిగిపోతోంది. అంటే నో టాకింగ్.. ఓన్లీ ఛాటింగ్ అన్నమాట. ఉరుకుల పరుగుల జీవితంలో యువత దీనివైపే ఎక్కువగా మొగ్గు చూపుతోంది.

ఒక విధంగా చెప్పాలంటే ఈ జనరేషన్‌ కమ్యూనికేషన్ అంతా చాలా వరకు షార్ట్‌కట్ అయిపోయింది. అది అంతా వాట్సాప్ లోనో, సోషల్ మీడియా వేదికల్లోనో జరిగిపోతోంది. బిజీ వర్క్ షెడ్యూల్, ఈజీ కమ్యూనికేషన్ అండ్ సౌలభ్యం కారణంగా ఫోన్‌ చేసి మాట్లాడేకంటే టెక్ట్స్ రూపంలో ఛాటింగ్ చేయడానికే యువతరం ఎక్కువగా మొగ్గు చూపుతోంది. దీనినే టెక్ట్స్‌టేషన్‌షిప్(Textationship)గా పేర్కొంటున్నారు నిపుణులు. ఇటీవల యువతలో ఈ ట్రెండ్ బాగా పెరిగిపోయింది.

బీజీ షెడ్యూల్ కారణంగా కాల్ చేసి లేదా నేరుగా కలుసుకొని మాట్లాడటం కంటే కూడా టెక్ట్స్(Tex) రూపంలో ఛాటింగ్ చేయడమే యువతకు ఈ రోజుల్లో ఆనందాన్ని ఇస్తోందట. పైగా ఇది ఒత్తిడి రహితమైనది. సౌకర్యంగానూ ఉంటుంది. వెళ్తూ వెళ్తూ కూడా కొనసాగించవచ్చు. జర్నీలో, ఆఫీసులో ఎక్కడున్నా ఎటువంటి ఇబ్బంది లేకుండా టెక్ట్స్ సెండ్ చేయడం, రిసీవ్ చేసుకోవడం చేయవచ్చు. మొత్తానికి ఫోన్ కాల్స్ మాట్లాడుకోరు. ప్రత్యక్షంగా కలుసుకోరు. కానీ మనసులోని మాటలను, భావాలను పంచుకుంటారు. అంటే కమ్యూనికేషన్ అంతా వాట్సాప్‌లోనో, ఏదో ఒక సోషల్ మీడియా వేదికల్లోనో కొనసాగుతుంది. దటీజ్ టెక్ట్స్‌టేషన్‌షిప్. అయితే ఇది కేవలం యువత మధ్య జరిగే సాధారణ కమ్యూనికేషన్ మాత్రమే కాదు, ఆధునిక సంబంధాలు, రొమాంటిక్ లేదా ప్లాటోనిక్‌గానూ ఉండవచ్చు.

Next Story