అబ్బాయిల్లా మీసాలు రావడం.. టీనేజ్ అమ్మాయిల్లో ఎందుకిలా?

by Javid Pasha |

అబ్బాయిల్లా మీసాలు రావడం.. టీనేజ్ అమ్మాయిల్లో ఎందుకిలా?
X

దిశ, ఫీచర్స్ : ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండే వయసు టీనేజ్. అనేక భావోద్వేగాలతో నిండిన ఒక ముఖ్యమైన స్టేజ్. అయితే ప్రపంచ వ్యాప్తంగా కొందరు అమ్మాయిల్లో ఈ వయసు మానసిక ఆందోళనకు, ఒత్తిడికి గురిచేస్తోంది. కారణం అబ్బాయిల్లాగా, అమ్మాయిల్లోనూ మీసాలు(Mustache) పెరగడం. అసలే టీనేజ్. పైగా మగరాయుడిలా మూతిపై మీసాలేంటి! అని ఇతరులు ఎగతాళి చేయడం, సెల్ఫీలు తీసుకోవడానికి ఇష్టపడకపోవడం, అబ్బాయిలకు తాము నచ్చకపోవడం వంటి సమస్యలు, అవమానాలు ఎదుర్కోవడంవల్ల కొందరు బాలికలు మనస్థాపానికి గురవుతున్న సందర్భాలు కూడా ఉంటున్నాయని నిపుణుల అంటున్నారు. ఒకప్పుడు ఈ ప్రాబ్లం ప్రతీ 10 మందిలో ఇద్దరు బాలికలు మాత్రమే ఎదుర్కొనేవారు. కానీ ప్రస్తుతం ప్రతీ 10 మందిలో ఆరుగురు దీనిని ఫేస్ చేస్తున్నారు.

కారణం ఏమిటి?

ప్రధానంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అమ్మాయిల్లో మీసాల పెరుగుదలకు దారితీస్తున్నదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి ఇందుకు దారితీస్తున్నాయి. అంతేకాకుండా స్కూల్ ఏజ్ పిల్లల్లో పెరుగుతున్న ఊబకాయం, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్‌లను ఎక్కువగా తినడం, హై షుగరింగ్ డ్రింక్స్ తాగడం, ఎక్కువసేపు మొబైల్ లేదా ల్యాప్‌టాప్ ముందు కూర్చోవడం, ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం వంటివి బాలికల్లో ఎండోక్రైన్ సిస్టమ్(hormone control system) పనితీరుకు ఆటకం(Disrupt) కలిగిస్తున్నాయి. టీనేజ్‌లో టెస్టోస్టెరాన్ (Male hormone) లెవెల్స్ పెరిగిపోవడానికి కారణం అవుతున్నాయి. ఫలితంగా ముఖంపై, మెడపై, చేతులపై వెంట్రుకలు పెరగుతున్నాయి. ఈ సమస్య ప్రస్తుతం అమెరికా, యూరప్, భారత్, చైనా వంటి దేశాల్లో కనిపిస్తోంది. అయితే అమ్మాయిలు అదేదో పెద్ద సమస్యగా పరిగణించకూడదని, శరీరంలో జరిగే మార్పులే కారణమని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రభావం - పరిష్కారం

బాలికల్లో బాలుర మాదిరి మీసాలు పెరగడం వారిని మానసిక వేదనకు, పాఠశాలల్లో, సామాజిక పరిస్థితుల్లో ఇతరుల నుంచి అవహేళనకు గురిచేస్తున్నది. పలువురిలో మానసిక ఒత్తిడి పెరగడానికి, ఆత్మ విశ్వాసం, ఆత్మ గౌరవం (Self-esteem) తగ్గడానికి కూడా దారితీస్తున్నది. వైద్య నిపుణుల ప్రకారం.. ఆధునిక జీవనశైలిలో అధిక స్క్రీన్ టైమ్, తక్కువ వ్యాయామం, అధిక కార్బోహైడ్రేట్స్, షుగరింగ్ డ్రింక్స్ వంటివి ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను పెంచి, ఆండ్రోజెన్ హార్మోన్ల (Testosterone)ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. క్రమంగా ఇవి పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) వంటి దీర్ఘకాలిక సమస్యలకు కూడా దారితీయవచ్చు. అయితే రోజూ 30 నిమిషాలు నడక లేదా ఆటలు, జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ వంటి బయటి ఆహారాలు తినకపోవడం, ఇంట్లోనే ప్రిపేర్ చేసిన హెల్తీ ఫుడ్స్ తినడం వంటి అలవాట్లు టీనేజ్ అమ్మాయిల్లో హార్మోన్ల సమతుల్యతను నియంత్రించడం ద్వారా మీసాలు పెరగకుండా సహాయపడతాయి. అవసరమైతే వైద్య నిపుణులను సంప్రదించి తగిన సలహాలు, సూచనలు పాటించాలి. Link

Next Story