Tangerine Peels: బంగారం కంటే కాస్ట్‌లి.. ఈ తొక్క తొక్కలోది కాదు.. పండిస్తే లాభల పంటే

by Vennela |

Tangerine Peels: ప్రపంచంలో విలువైన వస్తువు ఏది? అందరికి తెలిసింది బంగారమే.

Tangerine Peels: బంగారం కంటే కాస్ట్‌లి.. ఈ తొక్క తొక్కలోది కాదు.. పండిస్తే లాభల పంటే
X

దిశ, వెబ్ డెస్క్: Tangerine Peels: ప్రపంచంలో విలువైన వస్తువు ఏది? అందరికి తెలిసింది బంగారమే. కానీ బంగారం(Gold) కంటే ఖరీదైనవి చాలానే ఉన్నాయి. బంగారం కంటే ఖరీదైన వస్తువు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దాని గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా బంగారం కంటే ఖరీదైందని అంటారు.

ప్రపంచవ్యాప్తంగా చాలా రకాల పండ్లు ఉన్నాయి. అందులో విలువైన పండ్లు కూడా ఉన్నాయి. అందులో ఒకటి టాన్జేరిన్(Tangerine). దీనిని చైనాలో కాంటోనీస్ అనే పేరుతో పిలుస్తారు. ఈ పండుతొక్క ధర బంగరాం కంటే విలువైందని తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఈ పండు ఎండబెట్టిన తొక్క అత్యంత ఖరీదు ధరకు అమ్ముడుపోతోంది. చైనీస్ ఔషధ మొక్క(Chinese medicinal plant)ల్లో పాత టాన్జేరిన్ తొక్క (tangerine peels)ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పండు తొక్కలో అనేక పోషకాలను ఉన్నాయని అక్కడి ప్రజలు చెబుతుంటారు. అయితే ఈ పండును చాలా ప్రాంతాల్లో పండించినప్పటికీ..చైనాలోని గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్(Guangdong Province) లోని జియాంగ్ మెన్(Jiang Men) తూర్పు తీరంలో పండే పంట చాలా విలువైనదిగా చెబుతుంటారు అక్కడి ప్రజలు.

ఈ పండు తొక్క పొడిని చపానీ(Chapani) అని పిలుస్తుంటారు. అయితే ఈ పొడి అంత ఈజీగా తయారు కాదు. ప్రతి శరదృతువు చలికాలంలో లభించే ఈ పండును తొక్కను సుమారు 3ఏళ్ల పాటు ఎండలో ఎండబెడతారు. తర్వాత వాటితో పొడిని తయారు చేస్తారు. బెరడు ఎంత పెద్దదిగా ఉంటే అంతే ఖరీదుగా విక్రయిస్తారని చెబుతున్నారు. పొడిని ఆరోగ్యంతోపాటు ఇది ఆహారం, మద్యంలో కూడా ఉపయోగిస్తుంటారు.

అయితే ఈ పండు ఖరీదును ఓ నివేదికలో పేర్కొన్నారు. 2023లో ఒక కిలో గ్రాము ఎండిన టాన్జేరిన్ తొక్క హాంకాంగ్ లో US$9646కు వేలం వేశారు. 2023లో 100 బిలియన్ యువాన్లు సంపాదించారని అంచనా .

Next Story