ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీ తమిళనాడులో ప్రత్యేక పదకోశం..

by Disha Web Desk 22 |
ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీ తమిళనాడులో ప్రత్యేక పదకోశం..
X

దిశ, ఫీచర్స్ : భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్రం ప్రభుత్వ గెజిట్‌ నందు స్థానిక భాషలో LGBTQIA+ వ్యక్తులను సంబోధించేందుకు ప్రత్యేక పదకోశాన్ని విడుదల చేసింది. తమిళనాడులోని సాంఘిక సంక్షేమ, మహిళా సాధికారత శాఖ ఆగస్టు 20న LGBTQIA+ కమ్యూనిటీ సభ్యులను ఉద్దేశించి తమిళ పదాల గ్లాసరీని ప్రచురిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో LGBTQAI+ కమ్యూనిటీ సభ్యులను సంబోధించేందుకు ఆంగ్ల పదాలకు సమానమైన తమిళ పదాలను పొందుపరిచింది.

ప్రభుత్వం జారీ చేసిన కొన్ని పదాలు:

* క్వీర్-పాల్ పుధుమైయార్

* ఇంటర్‌సెక్స్ - ఇడైప్పాల్

* జెండర్ నాన్ కన్‌ఫర్మింగ్ పర్సన్ - పాలిన అడైయాలంగలుడన్ ఒత్తుపొగత్తావర్

* ట్రాన్స్‌జెండర్ పర్సన్ - మరువియ పాలినం

* జెండర్ నాన్‌బైనరీ పర్సన్ - పాలిన ఇరునిలైక్కు అప్పార్పత్తవర్

* జెండర్ డిస్ఫోరియా - పాలినా మనౌలైచల్

* జెండర్ ఇన్‌కాగ్రుయెనస్ - పాలిన మురంపాడు

* జెండర్ ఫ్లుడిటీ - నిలయాత్ర పాలిన అడయాళం

* సిస్ జెండర్ - మిగై పాలినం

* పాన్ సెక్సువాలిటీ - అనైతు పాలీర్పు

* కమింగ్ అవుట్ - వెలిపాడుతుతాల్

* అలీ - తోజమయ్యర్

* జెండర్ అఫర్మేషన్ సర్జరీ - పాలిన ఉరుడిపాత్తు అరువై సిగిచై

ఈ నెల 20వ తేదీన సాంఘిక సంక్షేమ, మహిళా సాధికారత శాఖ తమిళనాడు ప్రభుత్వ గెజిట్‌లో ఈ పదకోశం ప్రచురించబడిందని మద్రాస్ హైకోర్టు అదనపు అడ్వకేట్ జనరల్ (ఏఏజీ).. మంగళవారం జస్టిస్ ఎన్ అనంత్ వెంకటేష్‌కు తెలిపారు. సదరు కాపీని న్యాయమూర్తికి అందించారు. కాగా అధికారిక గెజిట్‌లో ప్రచురించిన పదకోశంలో పేర్కొన్న నిబంధనలకు చట్టబద్ధమైన మద్దతు ఉంటుంది. LGBTQIA+ కమ్యూనిటీని ఏదైనా ఫోరమ్ అడ్రస్ చేయాల్సి వచ్చినప్పుడు అది గెజిట్‌లో పేర్కొన్న నిబంధనలను ఉపయోగించడం ద్వారా మాత్రమే సంబంధిత విషయాలను వివరించడం తప్పనిసరి. అలా చేయడం ద్వారా LGBTQIA+ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులను మరింత గౌరవంగా సంబోధించే ప్రయత్నం జరుగుతుందని AAG తెలిపారు. ఇకపై విజువల్ అండ్ ప్రింట్ మీడియా సహా సంబంధితులందరూ తప్పనిసరిగా నోటిఫికేషన్‌ను గమనించాలని, అవసరమైన చోట నోటిఫైడ్ నిబంధనలను మాత్రమే ఉపయోగించడం ద్వారా సంఘానికి చెందిన వ్యక్తులను సంప్రదించాలని స్పష్టం చేశారు.

ట్రాన్స్‌జెండర్ పాలసీ విషయంలో తుది ముసాయిదాను రూపొందించేందుకు మరో ఆరు నెలల సమయం కావాలని ప్రభుత్వం కోరింది. కానీ ట్రాన్స్‌జెండర్ పాలసీని ఖరారు చేయడానికి మరో ఆరు నెలలు ఆమోదయోగ్యం కాదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ప్రభుత్వం అత్యవసర చొరవ తీసుకోవాలని సూచించారు.


Next Story

Most Viewed