- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమ్మర్ వైబ్.. లూజ్ షూజ్!
వేసవి వచ్చిందంటే సెంట్రల్ జైల్ నుంచి బయటపడ్డంత హాయిగా ఉంటుంది కాళ్లకు. ‘నా కొడుకొచ్చాడు.. ఊపిరి పీల్చుకో మాహిష్మతి’ అనే రేంజ్‌లో ఎలివేషన్లు ఉంటాయి ఈ సీజన్‌కి.

దిశ, ఫీచర్స్: వేసవి వచ్చిందంటే సెంట్రల్ జైల్ నుంచి బయటపడ్డంత హాయిగా ఉంటుంది కాళ్లకు. ‘నా కొడుకొచ్చాడు.. ఊపిరి పీల్చుకో మాహిష్మతి’ అనే రేంజ్‌లో ఎలివేషన్లు ఉంటాయి ఈ సీజన్‌కి. అలాంటి కొన్ని సమ్మర్ స్పెషల్ ట్రెండీ షూజ్ గురించి తెలుసుకుందాం.
ఊపిరాడేలా..
ఏవో షూజ్ వేసుకున్నామా.. రోజు గడిచిందా అని కాకుండా పెడిక్యూర్‌ను అందంగా మార్చే ట్రెండీ షూ స్టయిల్స్ వస్తున్నాయి మార్కెట్లోకి. వేసవిలో అత్యంత ట్రెండీ షూజ్‌ల్లో రాఫియా స్లయిడ్స్ ముందుంటాయి. సహజమైన రాఫియా మెటీరియల్‌తో తయారైన ఈ స్లయిడ్స్ కాళ్లకు ఊపిరాడేలా అంటే గాలి తగిలేలా చేస్తాయి. కొన్ని షూజ్ అన్ని రకాల డ్రెస్‌ల మీద సూటవ్వవు. కానీ రాఫియా స్లయిడ్స్ ఏ డ్రెస్‌తోనైనా సరిపోతాయి. సమ్మర్ వైబ్‌తో సమ్మగా ఉంటాయి. కుషనేర్ బొలేరో సాండల్స్, ఈక్వేడ్ రాఫియా ఫ్లాట్ సాండల్ వంటివి మార్కెట్లో ఎక్కువగా అమ్ముడవుతున్నాయి.
కాళ్లెంతో సమ్మగా..
సమ్మర్ ఫ్రెండ్లీ షూజ్‌లో చాలా కంఫర్ట్, కాస్లీ లుక్ తీసుకొచ్చే ఇంకో మోడల్ క్లాసిక్ థాంగ్ సాండల్స్. ఇవిప్పుడు కొత్త రూపంలో వచ్చాయి. చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. లుక్‌ను కూడా పాలిష్డ్‌గా చూపిస్తాయి. బర్గండీ బెర్రీ, మోచా వంటి మోడల్స్ ఈ ట్రెండ్‌కు చక్కటి ఎగ్జాంపుల్. ఇక పెడిక్యూర్‌ను మరింత ఆకర్షణీయంగా చూపించాలంటే ఓపెన్ టో సాండల్స్ ఉత్తమం. డయార్, జియాంబటిస్టా వల్లి వంటి డిజైనర్లు ఈ ట్రెండ్‌ను పాపులర్ చేశారు. ఇక స్కల్ప్‌ప్చరల్ వెడ్జెస్ మరో హాట్ ట్రెండ్. కంఫర్ట్, స్టయిల్ రెండూ కలిపి ఉండే ఈ షూజ్ వేసవిని సౌకర్యవంతంగా మార్చేస్తాయి.






