- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చేయి పట్టుకుంటే తగ్గుతున్న స్ట్రెస్.. భావోద్వేగ శ్రేయస్సులోనూ కీ రోల్..!
చేయి పట్టుకుంటే తగ్గుతున్న స్ట్రెస్.. భావోద్వేగ శ్రేయస్సులోనూ కీ రోల్..!

దిశ, ఫీచర్స్ : ‘వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తుండవచ్చు కానీ ఇది నిజం. ప్రియమైన వ్యక్తి చేయి పట్టుకోవడం మానసిక ఆనందాన్నిస్తుందని, తద్వారా మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది’’ అంటున్నారు సైకాలజిస్టులు. ‘Journal of Behavioral Medicine’లో పబ్లిషైన అధ్యనం కూడా ఇదే పేర్కొంటున్నది. ఇష్టమైన వ్యక్తిని తాకడం, ఆలింగనం చేసుకోవడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం వంటివి హ్యాపీనెస్‌తో ముడిపడిన ఫీల్ గుడ్ టచ్ కాబట్టి, భావోద్వేగ శ్రేయస్సులో కీలకపాత్ర పోషిస్తాయని, అందులో చేయి పట్టుకోవడమనేది అలాంటిదేనని అధ్యయనాన్ని విశ్లేషించిన నిపుణులు చెబుతున్నారు.
ప్రియమైన వ్యక్తి చేయి పట్టుకోవడం సహజంగానే ఒత్తిడిని తగ్గించి, ఆత్మ విశ్వాసాన్ని కలిగిస్తుందని గత అధ్యయనాలు సైతం చెబుతున్నాయి. తాజా అధ్యయనం కూడా అదే వెల్లడించింది. ఇక అపోజిట్ జెండర్ విషయంలో ఈ ప్రభావం మరింత అధికంగా ఉంటుందని తెలిపింది. అంటే స్త్రీ, పురుషుల మధ్య ఇష్టంతో, పాజిటివ్ దృక్పథంతో కూడిన స్పర్శ లేదా ఒకరి చేయిని మరొకరు పట్టుకోవడం వంటి చర్య లవ్ హార్మోన్ అయిన ఆక్సిటోసిన్(Oxytocin) విడుదలను ప్రేరేపిస్తుంది. దీంతో ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయని అధ్యయనాన్ని విశ్లేషించిన నిపుణులు చెబుతున్నారు.
చేయి పట్టుకోవడం వల్ల కలిగే స్పర్శతో కేవలం యువతలో, పెద్దల్లో, భాగస్వాముల మధ్య మాత్రమే కాదు పిల్లల్లో కూడా ఆరోగ్యానికి, ఆనందానికి దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులు పిల్లల చేయిపట్టుకోవడం, పిల్లలు తల్లిదండ్రుల చేయి పట్టుకోవడం, అలాగే తోబుట్టువులు, స్నేహితులు పరస్పరం చేయి పట్టుకోవడం(Holding hands) వంటివి భావోద్వేగ అనుబంధాన్ని బలోపేతం చేస్తాయి. మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి. ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తాయి. ఆరోగ్యపరంగా రక్తపోటును తగ్గించి, హృదయ స్పందన రేటును స్థిరీకరించడంలో ప్రియమైన వ్యక్తి చేయి పట్టుకోవడమనేది కీ రోల్ పోషిస్తుందని నిపుణులు అంటున్నారు.






