స్టైల్‌గా ఉంటుందని గడ్డం పెంచుతున్నారా..? బ్యాక్టీరియాలు ఉంటాయ్ జాగ్రత్త!

by Javid Pasha |

పురుషుల గడ్డాల్లో కుక్కల బొచ్చుకంటే కూడా ఎక్కువ ‘హై మైక్రోబియల్ కౌంట్స్’ ఉంటున్నాయని ఒక అధ్యయనంతో వెల్లడైంది

స్టైల్‌గా ఉంటుందని గడ్డం పెంచుతున్నారా..? బ్యాక్టీరియాలు ఉంటాయ్ జాగ్రత్త!
X

దిశ, ఫీచర్స్ : కొందరు యువకులు గడ్డాలు మీసాలు తీసేయడం స్టైల్ అనుకుంటారు. మరికొందరు వీటిని ఎక్కువగా పెంచడం స్టైల్ అనుకుంటారు. ఇక్కడ ఎవరిష్టం వారిది. ఎవరికి నచ్చినట్లు వారు ఉండొచ్చు. కానీ స్విట్జర్లాండ్‌లోని Hirslanden క్లినిక్ వారు నిర్వహించిన ఒక అధ్యయనం మాత్రం పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. గడ్డం పెంచడం ఆరోగ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నది. ఎందుకంటే గడ్డాల్లో కుక్కల బొచ్చుకంటే కూడా ఎక్కువ బ్యాక్టీరియాలు ఉంటున్నాయని స్పష్టం చేసింది. ఆ వివరాలేమిటో చూద్దాం పదండి!

కుక్కల బొచ్చుకంటే ఎక్కువ..

అధ్యయనంలో భాగంగా హిర్స్‌లాండెన్ (Hirslanden) క్లినిక్‌కు చెందిన నిపుణులు 18 మంది పురుషుల గడ్డాల(beards)ను పరిశీలించగా.. వాటిలో పలు రకాల బ్యాక్టీరియాలు ఉంటున్నాయని, ముఖ్యంగా ‘హై మైక్రోబియల్ కౌంట్స్’ ఎక్కువగా ఉన్నాయని కనుగొన్నారు. ఇవే బ్యాక్టీరియాలు కుక్కల బొచ్చు(వెంట్రుకలు)లో కూడా ఉంటున్నాయని గుర్తించారు. 18 మంది గడ్డం ఉన్న వ్యక్తులను, 30 కుక్కల నమూనాలను పరీక్షంగా.. కుక్కల్లో 23 మాత్రమే ‘హై మైక్రోబియల్ కౌంట్స్’ ఉండగా.. మనుషుల గడ్డాల్లో ఇవి ఎక్కువగా ఉంటున్నాయి. రెండవసారి అధ్యయనంలో కూడా 7 మంది పురుషుల గడ్డాలను అనలైజ్ చేయగా ‘Staphylococcus aureus, Enterococcus faecalis’ వంటి మానవులకు హానికరమైన బ్యాక్టీరియాలు ఉన్నట్లు తేలింది. కాగా అధ్యయనం ఎంఆర్‌ఐ, స్కానర్లను మనుషులు, కుక్కలు షేర్ చేసుకోవడం సురక్షితమేనా కాదా అని తెలుసుకోవడానికి చేసినది. కానీ ఫలితాలు ఆశ్చర్యకరమైన విషయాలను సైతం బయటపెట్టాయి.

హైజీన్‌ ముఖ్యం

అధ్యయనం పురుషుల గడ్డం (beard) హైజీన్‌పై ఫోకస్ పెట్టినప్పటికీ ఇది చిన్న సాంపుల్ సైజ్ (కేవలం 18 మంది) స్టడీ కావడంతో.. అందరి గడ్డాలు అంతే డేంజర్ అని కూడా చెప్పలేం అంటున్నారు నిపుణులు. రోజువారీ పరిశుభ్రతను బట్టి కూడా కొందరిలో తక్కువ బ్యాక్టీరియాలు లేదా బ్యాక్టీరియాలు లేకపోవడం కూడా జరగొచ్చునని పేర్కొన్నది. అయితే గడ్డం వెచ్చదనం, తేమ, జిడ్డు చర్మం, ఆహార అవశేషాలు వంటివి కూడా గడ్డాల్లో బ్యాక్టీరియా పెరగడానికి అనుకూల వాతావరణం క్రియేట్ చేస్తాయని నిపుణులు అంటున్నారు. ఎవరికి నచ్చినట్లు వారు ఉండొచ్చు. కానీ హైజీన్‌పై ఫోకస్ చేయడం ఇక్కడ ఆరోగ్యానికి చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. అందుకోసం మైల్డ్ బియర్డ్ షాంపూలతో రెండు మూడు రోజులకొకసారి గడ్డాలను క్లీన్ చేయవచ్చు. అలాగే బియర్డ్ ఆయిల్ లేదా కండిషనర్ ఉపయోగించి మాయిశ్చరైజ్ కూడా చేయవచ్చునని నిపుణులు చెబుతున్నారు.

Next Story