ఆఫీసు రొమాన్స్‌లో భారత్ టాప్.. వాళ్లకే ఇంట్రెస్ట్ ఎక్కువ..

by Sujitha Rachapalli |   (  Updated:2025-11-13 11:00:05  IST  )

భారతదేశం వివాహ బంధం విషయంలో ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ముఖ్యంగా ఇల్లీగల్ రిలేషన్స్ ఎక్కువైపోయాయి. మ్యారేజ్‌కు కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉండాలనే ఆలోచనలు పెరిగిపోయాయి. ఇక ఆఫీసులో రొమాన్స్ విషయానికి

ఆఫీసు రొమాన్స్‌లో భారత్ టాప్.. వాళ్లకే ఇంట్రెస్ట్ ఎక్కువ..
X

దిశ, వెబ్ డెస్క్ : భారతదేశం వివాహ బంధం విషయంలో ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ముఖ్యంగా ఇల్లీగల్ రిలేషన్స్ ఎక్కువైపోయాయి. మ్యారేజ్‌కు కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉండాలనే ఆలోచనలు పెరిగిపోయాయి. ఇక ఆఫీసులో రొమాన్స్ విషయానికి వస్తే సరే సరి. తాజాగా నిర్వహించిన అధ్యయనంలో విస్తుపోయే వాస్తవాలు బయటకొచ్చాయి. ప్రతి పది మందిలో నలుగురు ఇలాంటి రిలేషన్‌లో ఉన్నారని తేల్చి చెప్పింది స్టడీ.

స్టడీ వివరాలు..

డేటింగ్ ప్లాట్ ఫామ్ ఆష్లే మాడిసర్, యూగావ్ సంయుక్తంగా సర్వే నిర్వహించింది. ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, జర్మనీ, భారత్, ఇటలీ, స్విట్జర్లాండ్, స్పెయిన్, యూకే, అమెరికా, ఇటలీ వంటి 11 దేశాలకు చెందిన వ్యక్తులను ఈ అధ్యయనంలో భాగం చేసింది. దాదాపు 13, 581 మంది ఇందులో పాల్గొనగా.. సహోద్యోగితో డేటింగ్ గురించిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. మొత్తానికి ఆఫీస్‌లో రొమాన్స్ విషయంలో 43శాతంతో మెక్సికో టాప్ చేయగా.. 40శాతంతో ఇండియా సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. అమెరికా, యూకే, కెనడా 30శాతంతో తర్వాతి స్థానంలో నిలిచాయి.

పురుషులకే ఇంట్రెస్ట్..

అయితే మహిళలతో పోలిస్తే పురుషులు ఆఫీస్ రొమాన్స్‌లో ఎక్కువ ఇంట్రెస్ట్‌తో ఉన్నారు. అబ్బాయిలు 51 శాతం మంది సహోద్యోగినితో రొమాన్స్‌కు ఇంట్రెస్ట్ చూపించగా..అమ్మాయిలు 36శాతం మాత్రమే. ఇందుకు చాలా కారణాలు ఉండగా.. వృత్తిపరమైన కారణాలతో మరింత జాగ్రత్తగా ఉంటున్నారు. అయితే యూత్.. పద్దెనిమిది నుంచి 24ఏళ్ల మధ్యలో ఉన్నవారు ఎక్కువ జాగ్రత్తపడుతున్నట్లు తేలింది. కారణం ఇలాంటి రొమాన్స్‌లతో కెరీర్ స్పాయిల్ అవుతుందనే ఆందోళన.

గ్లీడెన్ సర్వేతో పోలిక..

భారతదేశంలో వివాహేతర సంబంధాలను స్వీకరించడం సాంస్కృతిక మార్పును సూచిస్తుందనడంలో సందేహం లేదు. కాగా తాజా స్టడీ ఇటీవలి గ్లీడెన్ సర్వే ఫలితాలకు సమానంగా ఉంది. ఇందులో 35శాతం మంది ఇండియన్స్ ఓపెన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు తేలింది. కేవలం పట్టణాల్లో మాత్రమే కాదు కాంచిపురం వంటి చిన్న టౌన్‌లలో కూడా ఇది ఎక్కువగానే ఉంది. ఎక్స్‌ట్రా మ్యారిటల్ ఎక్స్‌ప్లోరేషన్‌కు ఆసక్తి ఎక్కువగా కనిపిస్తుంది.

Next Story