Health : ప్రెగ్నెన్సీలో డిప్రెషన్.. పుట్టబోయే పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా?

by Javid Pasha |   (  Updated:2025-05-28 13:18:21  IST  )

Health : ప్రెగ్నెన్సీలో డిప్రెషన్.. పుట్టబోయే పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా?

Health : ప్రెగ్నెన్సీలో డిప్రెషన్.. పుట్టబోయే పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా?
X

దిశ, ఫీచర్స్ : కొన్ని ఆరోగ్య సమస్యలు వంశపారంపర్యంగా సంభవిస్తాయనే విషయం తెలిసిందే. గర్భధారణ సమయంలో స్త్రీలు ఎదుర్కొనే పలు మానసిక సమస్యలు కూడా పుట్టబోయే పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంటాయని పెద్దలు అంటుంటారు. అయితే అన్నీ అలా జరగవు కానీ, అరుదుగా కొన్ని జరిగే అవకాశం ఉందని అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ నివేదిక పేర్కొంటున్నది. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ టైమ్‌లో డిప్రెషన్‌కు(Prenatal depression) గురైతే ఆ ప్రభావం పిల్లలపై కూడా ఉంటుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అదెలాగో చూద్దాం.

*గర్భధారణ సమయంలో స్త్రీలు డిప్రెషన్ వంటి తీవ్రమైన మానసిక సమస్యను ఎదుర్కొంటే అది పుట్టుబోయే పిల్లల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా పిల్లల నిద్ర అలవాట్లపై ప్రభావం చూపడం ద్వారా వారు పదేండ్ల వయస్సు తర్వాత వారు నిద్రలేమి సమస్యలు ఎదుర్కొంటారని అధ్యయనాల్లో వెల్లడైనట్లు అమెరికన్ సైకాలాజికల్ అసోసియేషన్ నివేదిక పేర్కొంటున్నది. ముఖ్యంగా ఒక ఆడ శిశువుకు పుట్టుకతోనే తన తల్లి నుంచి అనేక లక్షణాలు సంక్రమిస్తాయని, ఇందులో మేధస్సు కూడా ఒకటని నిణులు చెబుతున్నారు.

*ప్రెగ్నెన్సీ సమయంలో తల్లిలో డిప్రెషన్ ఎక్కువకాలం ఉంటే గనుక దాని కారణంగా మైటో కాండ్రియా(Mitochondria) కూడా ప్రభావితం అవుతుంది. ఇందులో X X క్రోమోజోములు ఉంటాయి. వీటిని తల్లి నుంచి పుట్టబోయే కుమార్తె కూడా పొందుతుంది. కాబట్టి ఇవి మేధస్సు స్థాయిని నిర్ణయిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ రిపోర్ట్ ప్రకారం.. గర్భధారణ సమయంలో కుటుంబంతో, సన్నిహితులతో ఉండటంవల్ల స్త్రీకి హెల్త్ ప్రాబ్లమ్స్ గణనీయంగా తగ్గుతాయి. ఇక ఆ సమయంలో డిప్రెషన్‌తో బాధపడే మహిళలకు జన్మించే పిల్లలు తర్వాత కాలంలో ఉన్నత చదువులు చదివే అవకాశం కూడా తగ్గుతుందని నిపుణులు గుర్తించారు. కారణం వారిలో మానసిక ఆరోగ్య పరిస్థితి అందుకు సహకరించకపోవచ్చు.

*పలు ఆరోగ్య నివేదికల ప్రకారం కూడా గర్భధారణ సమయంలో డిప్రెషన్ ఎదుర్కొంటున్న స్త్రీలకు జన్మించిన పిల్లల్లో 20 శాతం మంది మాత్రమే ఉన్నత విద్యను పొందగలుగుతున్నారు. ఇక 85 శాతం ప్రెగ్నెన్సీలో తమ కుటుంబంతో ఉన్నప్పుడు మెంటల్లీ స్ట్రాంగ్‌గా ఉంటారు. దీంతో ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిచ్చే అవకాశం కూడా ఎక్కువ. కాబట్టి మహిళలు గర్భధారణ సమయంలో హ్యాపీగా ఉండే వాతావరణం క్రియేట్ చేసుకోవాలని, కుటుంబం అందుకు సహకరించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Next Story