- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండు గంటలపాటు నిశ్శబ్దం.. మీ మెదడును పునర్నిర్మిస్తుంది!
శబ్దం అనేది మెదడును ఎప్పుడూ అలర్ట్ స్థితిలో ఉంచి, స్ట్రెస్‌ను పెంచుతుంది. కానీ నిశ్శబ్దం నాడీ వ్యవస్థను రిలాక్స్ చేసి, బయటి శబ్దం లేనప్పుడు మెదడు తన లోపలికి దృష్టి మళ్లించి, కొత్త సమాచారాన్ని ఇంటిగ్రేట్ చేస్తుంది.

దిశ, ఫీచర్స్ : కొన్ని సందర్భాల్లో మౌనం కూడా మంచిదే.. అది మీ మనసును.. ఎదుటి వారి మనసును సైతం మార్చేస్తుంది అంటారు పెద్దలు. అయితే ‘Brain Structure and Function’ జర్నల్‌లో పబ్లిషైన ఇటీవలి ఒక పరిశోధన మరో కొత్త విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. ఏంటంటే.. 2 గంటల నిశ్శబ్దంగా ఉండటం మీ మెదడును పునర్నిర్మిస్తుంది. శారీరకంగా పలు మార్పులకు దారితీస్తుంది. అదెలా సాధ్యం? అందుకు గల కారణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
నిశ్శబ్దంగా ఉండటమంటే.. బయటి నుంచి ఏ శబ్దమూ వినబడని ప్రశాంతమైన ప్రదేశంలో ఉండటం. ఉదాహరణకు గదిలో ఎవరూ మట్లాడకపోవడం, టీవీ ఆఫ్ చేయడం, ప్రకృతి నిశ్శబ్దంగా గడపడం. ఇలా 2 గంటలు నిశ్శబ్దంగా ఉండటమనేది మెదడు హిప్పోకాంపస్‌లో కొత్త న్యూరాన్లు(brain cells) పెరగడానికి(neurogenesis) సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. నిజానికి హిప్పోకాంపస్ మెమోరీ పవర్, స్పేషల్ నావిగేషన్‌కు చాలా ముఖ్యమైన భాగం కూడాను. కాబట్టి నిశ్శబ్దం కేవలం మనశ్శాంతినిచ్చే చర్య మాత్రమే కాదు. ఇది బ్రెయిన్ రీజనరేషన్‌కి శక్తివంతమైన ట్రిగ్గర్ అని పరిశోధనలు చెబుతున్నాయి.
ఎలా పనిచేస్తుంది?
శబ్దం అనేది మెదడును ఎప్పుడూ అలర్ట్ స్థితిలో ఉంచి, స్ట్రెస్‌ను పెంచుతుంది. కానీ నిశ్శబ్దం నాడీ వ్యవస్థను రిలాక్స్ చేసి, బయటి శబ్దం లేనప్పుడు మెదడు తన లోపలికి దృష్టి మళ్లించి, కొత్త సమాచారాన్ని ఇంటిగ్రేట్ చేస్తుంది. ఇది న్యూరల్ కనెక్షన్లను బలపరుస్తుంది. అలాగే కొత్త కణాలు పెరగడానికి అనుకూల వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. ఇది “మెదడు ఎల్లప్పుడూ యాక్టివ్‌గా, ఉత్తేజంగా ఉన్న భావనన కల్పిస్తుంది.
ప్రయోజనాలు..
అధ్యయనాల ప్రకారం.. రెండుగంటలపాటు నిశ్శబ్దంగా ఉండటం అనేది జ్ఞాపక శక్తిని, నేర్చుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. మెదడు ఆరోగ్యాన్ని, పనితీరును, సామర్థ్యాన్ని మెరుగు పరుస్తుంది. మెదడు కణాలు, నరాలను యాక్టివ్‌గా ఉంచుతుంది. అంతేకుండాకు స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి మానసిక అనారోగ్యాల నుంచి బయటపడేస్తుంది. అందుకే ఏమాత్రం చాన్స్ దొరికినా ‘నిశ్శబ్దాన్ని ఆస్వాదించి చూడండి. ఆనందం, ఆరోగ్యం సొంతం చేసుకోండి’ అంటున్నారు నిపుణులు.






