అందంగా కనిపించడానికి 60 నిమిషాలు.. ఆ విషయంలో ప్రత్యేక సమయం కేటాయిస్తున్న స్త్రీలు..!

by Javid Pasha |

అందంగా కనిపించడానికి 60 నిమిషాలు.. ఆ విషయంలో ప్రత్యేక సమయం కేటాయిస్తున్న స్త్రీలు..!

అందంగా కనిపించడానికి 60 నిమిషాలు.. ఆ విషయంలో ప్రత్యేక సమయం కేటాయిస్తున్న స్త్రీలు..!
X

దిశ, ఫీచర్స్ : ఉన్నంతలో చక్కగా రెడీ అవ్వాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అయితే పురుషులతో పోలిస్తే, అందం, ఆరోగ్యం వంటి విషయాలపైట్ల మహిళలకే కాస్త ఎక్కువ శ్రద్ధ, ఆసక్తి ఉంటాయని పెద్దలు చెబుతుంటారు. ప్రముఖ కాస్మోటిక్ ప్రొడక్షన్ సంస్థ అయిన ‘Cosmopolitan’ నిర్వహించిన రీసెంట్ స్టడీలో కూడా అదే వెల్లడైంది. సాధారణంగానే మహిళలు అందంగా ముస్తాబవ్వడంపట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారని, సగటు మహిళ తన జీవితంలో అందుకోసం ప్రత్యేక సమయం కేటాయిస్తుందని తెలిపింది.

అందం, ఆరోగ్యం వంటి విషయాలపై ఎక్కువగా ఫోకస్ చేయడమంటే సమయం వృధా చేయడమేనని కూడా కొందరు భావిస్తుంటారు. కానీ ఇది సరైంది కాదని, పైగా రెడీ అవ్వడమనేది టైమ్‌ వేస్ట్ చేయడం ఎంతమాత్రం కాదని, ఇది మహిళల్లో స్వీయాభిమానానికి, ఆత్మ గౌరవానికి, ఆరోగ్యంపట్ల అవగాహనకు నిదర్శనమని అధ్యయనం పేర్కొన్నది. ఓవరాల్‌గా పరిశీలిస్తే.. ప్రతిరోజూ రెడీ అవ్వడానికి స్త్రీలు సగటున 60 నిమిషాల సమయం వెచ్చిస్తున్నారని అధ్యయనం తెలిపింది. స్నాన చేయడం, జుట్టు సరిచేయడం, మేకప్ వేసుకోవడం, సెట్ అయ్యే దుస్తులు ఎంపిక చేసుకోవడం వంటివి ఇందులో భాగంగా ఉన్నాయి.

ఒక సంవత్సరంలో సగటు మహిళ ముస్తాబవ్వడానికి కేటాయించే సమయాన్ని అంచనా వేస్తే.. 365 గంటలు. అంటే సుమారు 15 రోజులు అవుతుందని అధ్యయనం వెల్లడించింది. 60 ఏండ్ల వయోజన జీవితంలో (In 60 years of adult life) ఇది 912 రోజులు, లేదా దాదాపు 2.5 సంవత్సరాలకు సమానమని పేర్కొన్నది. అద్దం ముందు నిలబడి జుట్టు ఆరబెట్టడం(Drying hair) మేకప్ సరిచూసుకోవడం(coordinating makeup), తమకు నప్పే డ్రెస్సులను ఎంచుకోవడం వంటివి చూడ్డానికి చిన్న చిన్న పనులుగా అనిపిస్తుండవచ్చు. కానీ మహిళల జీవితంలో గణనీయమైన సమయాన్ని తీసుకుంటాయని, ఇవి వారిలో ఆనందానికి, ఆరోగ్యానికి, మానసిక వికాసానికి, స్వీయ గుర్తింపునకు దోహదం చేస్తాయని అధ్యయనం స్పష్టం చేసింది. Link

Next Story