పురుషుల్లో తగ్గుతూ వస్తున్న టెస్టో స్టెరాన్ లెవెల్స్.. కారణమిదే !

by Javid Pasha |

1980–2020 మధ్య పురుషుల్లో టెస్టోస్టెరాన్ సగటున సంవత్సరానికి 1–1.5% చొప్పున తగ్గుతూ వచ్చింది. అది కంటిన్యూ అవుతోంది.

పురుషుల్లో తగ్గుతూ వస్తున్న టెస్టో స్టెరాన్ లెవెల్స్.. కారణమిదే !
X

దిశ, ఫీచర్స్ : ‘ఎంతైనా అప్పటి మనుషులు గట్టోల్లు’ అంటుంటారు పెద్దలు. అంటే ఈతరం కంటే గత తరాలు మానసికంగా, శారీరకంగా బలమైన వారిగా పేర్కొంటారు. ముఖ్యంగా 1970-80లలో అత్యధికమంది 90 నుంచి వందేండ్లకు పైగా కొందరైతే 120 ఏండ్ల వరకు కూడా బతికిన వారు ఉన్నారు. కానీ ప్రస్తుతం 60 ఏండ్లు పైబడిన వారికి ఎప్పుడేం జరుగుతుందో, ఏ అనారోగ్య సమస్య దాడిచేస్తుందో చెప్పలేని పరిస్థితి. ఇదంతా పక్కన పెడితే ఒకప్పటితో పోలిస్తే పురుషుల్లో ఆరోగ్యానికి మేలు చేసే టెస్టో స్టెరాన్ హార్మోన్ లెవల్స్ పడిపోతున్నాయని ది జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజం, హార్వర్డ్ హెల్త్ నుంచి వచ్చిన అధ్యయనం పేర్కొన్నది. ఆ వివరాలేమిటో చూద్దాం.

ప్రస్తుతం 22 ఏండ్ల యువకుల్లో ఉండే టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్ 1970లలో 70 ఏండ్ల వయసుగల పురుషుల్లోనూ ఉండేవని అధ్యయనాలు చెబుతున్నాయి. అంటే అప్పట్లో ఆరు పదులు దాటినా ఆరోగ్యానికి, సంతాన సాఫల్యానికి కారణమయ్యే టెస్టో స్టెరాన్ లెవెల్స్ పురుషుల్లో బాగానే ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండట్లేదు. 40 ఏండ్లు దాటాక ఈ హార్మోన్ లెవెల్స్ పడిపోతున్నాయి. సంతానం కలుగుతుందన్న గ్యారెంటీ కూడా లేకుండా పోతోంది. The Journal of Clinical Endocrinology & Metabolism డేటా ప్రకారం, 1980–2020 మధ్య పురుషుల్లో టెస్టోస్టెరాన్ సగటున సంవత్సరానికి 1–1.5% చొప్పున తగ్గుతూ వస్తోంది. అంటే ఇది ఒక జనరేషన్ మొత్తం హార్మోనల్ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసింది.

ప్రధానంగాఊబకాయం, నిరంతరం కూర్చొని పనిచేసే జీవనశైలి, ప్లాస్టిక్‌లలోని ఎండోక్రైన్ డిస్‌రప్టర్స్ (BPA, ఫ్తాలేట్స్), నిద్రలేమి, ఒత్తిడి, జంక్ ఫుడ్, విటమిన్ D & జింక్ లోపం వంటివి ఏర్పడటానికి కారణం అవుతున్నాయి. దీంతో యువకుల్లో శక్తి తగ్గుతోంది, స్పెర్మ్ కౌంట్ 50% కంటే ఎక్కువ పడిపోయింది. డిప్రెషన్–ఆందోళన, ఒంటరితనం వంటివి పెరుగుతున్నాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే టెస్టోస్టెరాన్ అనగానే అదేదో శృంగార జీవితానికి పనికొచ్చేది మాత్రమే అని అపోహ పడుతుంటారు. ఇది కేవలం సెక్స్ డ్రైవ్ హార్మోన్ మాత్రమే కాదు. పురుషుల్లో కండరాలు, రక్త నాళాలు బలంగా ఉండటానికి కూడా దోహదం చేస్తుంది.

రిస్క్ తీసుకునే స్వభావం, పోటీతత్వం, లక్ష్య సాధన వంటివన్నీ టెస్టో స్టెరాన్ హార్మోన్ ప్రేరేపితంగా ఏర్పడుతుంటాయి. అయితే ఇది కేవలం కొందరు యుకులు ఎదుర్కొంటున్న సమస్య మాత్రమే కాదు. ఒక తరం మొత్తం బయోలాజికల్‌గా ఇబ్బందిపడుతున్న సమస్యగా, లో ఎనర్జిటిక్ సమస్యగా మారిపోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే రాబోయే దశాబ్దాల్లో పురుషుల్లో అనారోగ్యాలు, సంతానలేమి సమస్యలు, నిరాశా, నిరుత్సాహం వంటివి పెరిగే అవకాశముందని చెబుతున్నారు. జీవనశైలిలో, ఆహారపు అలవాట్లలో ఆరోగ్యకరమైన మార్పులవల్ల ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుందని అంటున్నారు. Link

Next Story