- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
6 నిమిషాలు పుస్తకం చదవండి.. 68% ఒత్తిడి పరార్..!
వచనం, కవిత్వం, నవల, నాన్-ఫిక్షన్ ఇలా.. ఏదైనా సరే 6 నిమిషాలు పుస్తకం చదవినా ఒత్తిడి తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి

దిశ, ఫీచర్స్ : లేనిపోని ఆలోచనలతో మైండ్ బర్న్ అవుతోందా..? అధిక ఒత్తిడితో సతమతం అవుతున్నారా? అధిక ఆందోళనతో గుండె వేగం పెరుగుతోందా? డోంట్ వర్రీ.. జస్ట్ ఆరు నిమిషాలు మీకు ఇష్టమైన పుస్తకం చదవండి. ఆ తర్వాత బిగ్ రిలీఫ్ పొందుతారని ససెక్స్ యూనివర్సిటీకి చెందిన ఒక అధ్యయనం చెబుతున్నది. అంతేకాదు పుస్తకం చదవడం వల్ల మొద్దుబారిన మీ మెదడు గేర్ మార్చుకుంటుందని, ప్రమాదకర స్థాయిలో ఉన్న మీ గుండె చప్పుడు ప్రశాంతంగా మారుతుందని కూడా పేర్కొన్నది.
విజ్ఞానం.. భాషా పరిజ్ఞానం
ఒత్తిడిని, మీ మైండ్ పాడు చేసే అతి ఆలోచనలను పోగొట్టుకోవడానికి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. చేయాల్సిందల్లా మీకు నచ్చిన పుస్తకం చదివండి చాలు. ఆ ఒత్తిడంతా చిత్తయిపోతుంది అంటున్నారు ససెక్స్ యూనివర్సిటీలో కాగ్నెటివ్ న్యూరో సైకాలజిస్ట్ అయిన డాక్టర్ డేవిడ్ లూయిస్. ఆయన ఆధ్వర్యంలో జరిగిన అధ్యయనం ప్రకారం జస్ట్ 6 నిమిషాల బుక్ రీడింగ్ హాబిట్, మనిషిలోని ఒత్తిడి స్థాయిలను 68% వరకు తగ్గిస్తుంది. అంతేకాదండోయ్ చదివే అలవాటు మీలో విజ్ఞనాన్ని, భాషా పరిజ్ఞానాన్ని పెంచడంతోపాటు, మిమ్మల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.
పుస్తకం ఏదైనా.. చేసేది మేలే..
అది వచనం, కవిత్వం, నవల, నాన్-ఫిక్షన్ ఇలా ఇంకే రూపంలో ఉన్నా సరే పుస్తకం చదవడమనేది మీలో ఒత్తిడికి కారణమైన కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుంది. కండరాల ఉద్రిక్తతను(Relaxes muscle tension) సడలిస్తుంది. మైండ్‌ను రీసెంట్ చేస్తుంది. అంటే సంగీతం వినడం (61%), టీ తాగడం, (54%), లేదా వాకింగ్ చేయడం (42%) కంటే కూడా ఇది మోస్ట్ ఎఫెక్టివ్‌గా మీ మూడ్‌ను మార్చేస్తుంది. మీలోని ఒత్తిడి, ఆందోళనలను పటా పంచలు చేసేస్తుంది. ఇంకెందుకాలస్యం.. మీకు నచ్చిన పుస్తకమేదో వెతుక్కోండి!






