- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేదలే మనసున్నోళ్లు.. ఇతరులకు సహాయం చేయడంలో ధనవంతులకంటే వీళ్లే నయం!
పేదలు తమకు వచ్చే తక్కువ ఆదాయంలో నుంచి ఎక్కువ భాగం సహాయం చేయడానికి ఖర్చు పెడితే.. ధనవంతలు తమకు వచ్చే ఎక్కువ ఆదాయం నుంచి తక్కువ భాగం ఇతరులకు సహాయం చేయడానికి ఖర్చు పెడుతుంటారు.

దిశ, ఫీచర్స్ : ఇతరులకు దానం చేయాలన్నా, ఆపద సమయంలో హెల్ప్ చేయాలన్నా బాగా డబ్బుండాలనుకుంటారు చాలా మంది. కానీ వాస్తవానికి ధనవంతులకంటే, పేదలే ఇతరులకు ఎక్కువ సహాయం చేస్తుంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. పేదలు తమకు వచ్చే తక్కువ ఆదాయంలో నుంచి ఎక్కువ భాగం సహాయం చేయడానికి ఖర్చు పెడితే.. ధనవంతలు తమకు వచ్చే ఎక్కువ ఆదాయం నుంచి తక్కువ భాగం ఇతరులకు సహాయం చేయడానికి ఖర్చు పెడుతుంటారు. అంటే నిజానికి ఇక్కడ సహాయం చేసే గుణంలో పేదలు నిజమైన ధనవంతులైతే.. ధనవంతులు మాత్రం నిజమైన పేదలుగా అర్థం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు.
పేదలు ఇతరులకు ఎందుకని సహాయం చేస్తారు? వారిలో ఆ హెల్పింగ్ నేచర్ ధనవంతులకంటే ఎక్కువగా ఎందుకు ఉంటుంది? అంటే ఈ ధోరణి బహుళ ప్రయోగాలు, సర్వేలలో స్థిరంగా కనిపించిందని సైకాలజిస్టులు అంటున్నారు. తక్కువ వనరులు ఉన్నవారు, తక్కువ ఆదాయం వల్ల పేదలు కష్టాలంటే ఏమిటో, అవి ఎలా ప్రభావితం చేస్తాయో అప్పటికే అనుభవించి ఉంటారు. దీంతో ఇతరుల కష్టాలపపట్ల కూడా ఎక్కువ సానుభూతిని ప్రదర్శిస్తారు. ఉదాహరణకు ఒక తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తి తనకున్న తక్కువ వనరులు లేదా తక్కువ ఆదాయం నుంచే ఎక్కువ భాగాన్ని దానం చేయడం ద్వారా త్యాగభావాన్ని చూపిస్తాడు. ఈ ఔదార్యం తరచూ తక్షణమైన, భావోద్వేగ ఆధారితమైన చర్యగా ఉంటుంది. ఇది సామాజిక బంధాలను బలోపేతం చేస్తుంది.
మరోవైపు ధనవంతులు తమ ఆదాయంలో చిన్న శాతాన్ని (small percentage) మాత్రమే దానం చేస్తారని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఎందుకంటే వారు కష్టాల నుండి తరచూ దూరంగా ఉంటారు. ఇది ఇతరుల అవసరాల పట్ల వారి చిత్త శుద్ధిని, ఔదార్యాన్ని, సెన్సిటివిటీని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు ఒక ధనవంతుడు లక్షల రూపాయలు దానం చేయవచ్చు. కానీ అది వారి మొత్తం ఆదాయంలో చిన్న భాగం మాత్రమే. దీనికి విరుద్ధంగా, తక్కువ ఆదాయం ఉన్నవారు తమ దానం ద్వారా ఎక్కువ త్యాగాన్ని ప్రదర్శిస్తారు. ఇది వారి జీవనోపాధికి గణనీయమైన ప్రభావం చూపుతుంది. ఈ విరోధాభాసం తక్కువ ఉన్నవారు ఎక్కువ ఔదార్యం చూపడం, మానవ స్వభావంలో ఒక ఆసక్తికరమైన లక్షణాన్ని వెల్లడిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉన్నవారు పేదలే నిజమైన దయాగుణం కలవారని, ఇతరులకు పంచడంలో లేదా సహాయం చేయడంలో ఉండే నిజమైన ఆనందాన్ని, అనుభూతిని, లోతైన విలువను ఎక్కువగా అర్థం చేసుకుంటారని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఇది పేదల్లో సమాజంపట్ల సానుభూతిని, సామాజిక బాధ్యతను, ప్రాముఖ్యతను హైలైట్ చేస్తున్నది. Link






