- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Social media : పిల్లల్లో సోషల్ మీడియా అతివినియోగం.. ఇతరుల ఫీలింగ్స్‌ని అర్థం చేసుకునే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందా?

దిశ, ఫీచర్స్ : మీ పిల్లలు గంటల తరబడి సోషల్ మీడియాలో నిమగ్నమై పోతున్నారా? అయితే బీ కేర్‌ఫుల్! ఈ విధంగా చేయడం వారి మానసిక ఆరోగ్యంపై, ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే విషయం తెలిసిందే. అయితే ఇటీవలి ఒక అధ్యయనాలు మరో కొత్త విషయాన్ని కూడా ముందుకు తెచ్చాయి. ఏంటంటే.. యుక్త వయసులో (10 నుంచి 19 ఏండ్లలోపు) పిల్లలు సామాజిక మాధ్యమాలను అతిగా వినియోగించడం కారణంగా, వారిలో ఇతరుల భావాలను అర్థం చేసుకునే సామర్థ్యం దెబ్బతినే అవకాశం ఉందని ‘న్యూ యార్క్ - ప్రెస్బిటేరియన్’కు సంబంధించిన ‘హెల్త్ మ్యాటర్స్’ అధ్యయనం పేర్కొన్నది. సుమారు 2 నుంచి 3 గంటలు కంటిన్యూగా అంతకుమించి సోషల్ మీడియాలో నిమగ్నమై ఉండేవారిలో ఈ రిస్క్ పెరుగుతున్నది.
లాస్ ఏంజిల్స్‌లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా (UCLA) నిర్వహించిన ఒక అధ్యయనాల ప్రకారం కూడా.. సామాజిక మాధ్యమాలలో ఎక్కువ సమయం గడిపే పిల్లలు ఫేస్ టు ఫేస్ కన్వర్జేషన్ల సందర్భంగా ఇతరుల భావోద్వేగ సంకేతాలను గుర్తించడంలో ఇబ్బంది పడుతున్నారని తేలింది. అంతేకాకుండా పిల్లల మెదడులోని సహానుభూతిని(empathy) అర్థం చేసుకునే భాగం బలహీన పడుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. దీంతోపాటు అధిక సమయం సోషల్ మీడియాను స్క్రోల్ చేసే పిల్లల మెదడు భావోద్వేగ సంబంధాలను గుర్తించే, సందర్భాను సారంగా స్పందించే సామర్థ్యం క్రమంగా తగ్గుతుంది. ఫలితంగా వారు పెద్దయ్యాక కుటుంబం, సమాజంలోని ఇతరు వ్యక్తులను అర్థం చేసుకోవడంలో, ఆరోగ్యకరమైన సంబంధాలు కొనసాగించడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. Link






