- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వ్యాయాయాలు చేయడమే కాదు.. చేసినట్టు ఊహించుకున్నా సేమ్ బెనిఫిట్స్ !!
గ్రౌండ్‌లో కాదండోయ్.. మనసులో జిమ్ చేయడం వల్ల కూడా కండరాల బలం పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

దిశ, ఫీచర్స్ : వ్యాయామాలు చేయడం ఆరోగ్యానికి మంచిదనే విషయం అందరికీ తెలిసిందే. కానీ నిజంగా చేయకపోయినా.. చేసినట్టు ఊహించుకున్నా కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని మీకు తెలుసా? లూసియానా స్టేట్ యూనివర్సిటీ నిపుణుల అధ్యయనం సహా పలు ఇతర స్టడీస్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. శారీరక వ్యాయామం చేయలేని పరిస్థితుల్లో చేసినట్టు ఊహించుకోవడం వల్ల మెదడులోని మోటార్ సర్క్యూట్లు(motor circuits) ఉత్తేజితం అవుతాయని పేర్కొన్నాయి. ఇంకా ఏయే బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు చూద్దాం.
మనసులో జిమ్..!
గ్రౌండ్‌లో కాదండోయ్.. మనసులో జిమ్ చేయడం వల్ల కూడా కండరాల బలం పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. శారీరక వ్యాయామం చేయకుండా, కేవలం మనసులో ఊహించుకోవడం (mental imagery లేదా visualization) ద్వారా మెదడులోని మోటార్ సర్క్యూట్లు ఉత్తేజితమవుతాయి. ఎందుకంటే ఈ పరిస్థితి నిజమైన లిఫ్టింగ్ చేసినట్లుగా కండరాలకు సిగ్నల్స్ పంపుతుందని, దీంతో కండరాలు ప్రతిస్పందిస్తాయని అధ్యనాలను విశ్లేషించిన నిపుణులు చెబుతున్నారు. క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ఫౌండేషన్ 2004 నిర్వహించిన ఒక అధ్యయనంలో కూడా భౌతిక వ్యాయామం చేయకుండా మనసులో ఊహించుకున్నవారు వేలు(Finger ) బలాన్ని 35%, అలాగే కండర పుష్టిని (Biceps strength) 13.5% పెంచుకున్నారు.
మెదడు, కండరాలపై ప్రభావం
నిపుణుల ప్రకారం.. వ్యాయామాలను మనసులో ఊహించుకున్న వారి బ్రెయిన్ స్కాన్లు (fMRI) మెదడు యాక్టివిటీని నిజమైన వ్యాయామంతో సమానంగా చూపించాయని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మెంటల్ ట్రైనింగ్ న్యూరోమస్క్యులర్ అడాప్టేషన్ (neuromuscular adaptations) ద్వారా పనిచేస్తుంది. అంటే మెదడు, కండరాల మధ్య కమ్యూనికేషన్ మెరుగుపడుతుంది. బిషప్ యూనివర్సిటీ అధ్యయనంలో సైతం హిప్ ఫ్లెక్షన్ ఎక్సర్‌సైజ్‌ను మనసులో ఊహించుకున్నవారు 24% బలం పెంచుకున్నారు. అయితే భౌతికంగా చేసినవారు 28% పెంచుకున్నారు. అయితే తరచుగా కేవలం ఊహించుకోవడం మాత్రమే పూర్తి ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చదు. ఇది రిహాబిలిటేషన్‌లో (rehabilitation) ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా గాయాలు లేదా వృద్ధులకు భౌతిక వ్యాయామం కష్టమైనప్పుడు. ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి మెంటల్ ఇమేజరీ భౌతిక వ్యాయామానికి పూర్తి ప్రత్యామ్నాయం కాదు.






