- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Dieting Trends : మాంసాహారం మంచిదా..? శాఖాహారం మంచిదా..?
మితమైన జంతు ప్రోటీన్ వినియోగం క్యాన్సర్ రిలేటెడ్ మరణాల ప్రమాదాన్ని సైతం తగ్గిస్తుందని అధ్యయనం పేర్కొన్నది.

దిశ, ఫీచర్స్ : మాంసాహారం ఆరోగ్యానికి మంచిదనే విషయం తెలిసిందే. అయితే ఇటీవల వేగన్ డైట్, పెస్కటేరియన్ డైట్, ఫ్లెక్సిటేరియన్ డైట్, ప్లాంట్-బేస్డ్ ప్రోటీన్ ట్రెండ్, రా వేగనిజం వంటి పూర్తిగా మొక్క ఆధారిత ఆహారాలకు సంబంధించిన పోకడలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. పైగా ఇవి శాఖాహారంతో పోలిస్తే, మాంసాహారం అంత మంచిదేమీ కాదని, అందులోని ప్రోటీన్లు ఆరోగ్యానికి హానిచేస్తాయనే ప్రచారానికి కారణం అవుతున్నాయి. కానీ ఇది వాస్తవమేనా?.. కాదనే అంటున్నారు నిపుణులు. మెక్ మాస్టర్ యూనివర్సి(McMaster University)టీ పరిశోధకుల నేతృత్వంలో జరిగిన ఒక ఇంటర్నేషనల్ స్టడీ సైతం జంతు ఆధారిత మాంసాహారం ఏమాత్రం ప్రమాదకరం కాదని, పైగా అందులోని ప్రోటీన్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని బెబుతోంది.
తాజా అధ్యయనం ప్రకారం.. జంతువు ఆధారిత ప్రోటీన్ తీసుకోవడం అనారోగ్యాలు లేదా మొత్తం మరణాల రేటుతో ఏమాత్రం సంబంధం లేదని తేలింది. నిజానికి.. మితమైన జంతు ప్రోటీన్ వినియోగం క్యాన్సర్ రిలేటెడ్ మరణాల ప్రమాదాన్ని సైతం తగ్గిస్తుందని అధ్యయనం పేర్కొన్నది. అంతేకాకుండా ఇందులో ఐరన్, జింక్, విటమిన్ B12 వంటి అవసరమైన పోషకాలు ఉంటాయి. ఇవి కండరాల పెరుగుదలకు, రోగనిరోధక శక్తికి, శరీరంలో రక్తం ఉత్పత్తికి సహాయపడతాయని అధ్యయనంలో తేలింది. అంటే ఈ ఫలితాలు జంతు ప్రోటీన్‌ను ఎల్లప్పుడూ తగ్గించాలనే ప్రచారాలను, ఊహలను, భ్రమలను సవాలు చేస్తున్నాయి. ఆహారాన్ని అవసరానికి, ఆరోగ్యానికి, సందర్భానుసారంగా పరిగణించాలన్న విషయాన్ని హైలెట్ చేస్తున్నాయి. ఆహారం ఏదైనా దానిని తీసుకునే విధానం, ముఖ్యంగా క్వాలిటీ, సమతుల్యత(balance) కీలకమని పరిశోధకులు చెబుతున్నారు.
పరిశోధకుల ప్రకారం.. తక్కువ కొవ్వు కలిగిన మాంసం, పాల ఉత్పత్తులు, చేపలు వంటివి తినడం మానవ దీర్ఘాయుష్షుకు సహాయపడతాయి. అయితే అధికంగా ప్రాసెస్ చేయబడిన లేదా అధిక కొవ్వు ఉన్న ఆహారాలు అవి శాఖాహారమైనా, జంతు ఆధారిత మాంసాహారమైన ఆరోగ్యాన్ని రిస్క్‌లో పడేస్తుంది. అంతే తప్ప కేవలం మాంసాహారం ఒక్కటే అలా చేయదు. అంటే పరిశోధకుల ప్రకారం.. మొక్కల ఆధారిత ప్రోటీన్లు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే జంతు ఆధారిత మాంసం ద్వారా లభించే ప్రోటీన్లు కూడా మేలు చేస్తాయి. పరిమితికి మించి తీసుకోవడం ఇవి రెండు కూడా ప్రమాదాలను పెంచుతాయి. అధిక కొవ్వులు కలిగినప్పుడు రెండు కూడా హాని కలిగిస్తాయి. కాబట్టి జంతు ఆధారిత ప్రోటీన్లు లేదా మాంసాహారం మంచిది కాదనేది వాస్తవం కాదంటున్నారు పరిశోధకులు. వాటి మూలం, నాణ్యత, వినియోగించే విధానం అత్యంత ముఖ్యమని చెబుతున్నారు. Link






