Hydration must : సరిపడా నీళ్లు తాగక మొద్దుబారుతున్న పిల్లల మెదడు.. 60% మందిలో ఇదే అసలు ప్రాబ్లం..!

by Javid Pasha |   (  Updated:2025-08-30 07:27:31  IST  )

60% మంది పిల్లలు రోజువారీ అవసరమైన నీటిని తాగడం లేదు. ఇది వారి మెదడు పనితీరును దెబ్బతీస్తోంది

Hydration must : సరిపడా నీళ్లు తాగక మొద్దుబారుతున్న పిల్లల మెదడు.. 60% మందిలో ఇదే అసలు ప్రాబ్లం..!
X

దిశ, ఫీచర్స్ : మీ పిల్లలు తరచూ డల్‌గా ఉంటున్నారా? యాక్టివ్‌నెస్‌ను, చదువులో ఏకాగ్రతను, జ్ఞాపక శక్తిని కోల్పోతున్నారా? అయితే రోజూ సరిపడా నీళ్లు తాగుతున్నారో లేదో చెక్ చేయండి అంటున్నారు నిపుణులు. ఎందుకంటే 60% మంది పిల్లలు తగినంత నీరు తాగకపోవడంవల్లే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్లు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. 2019లో అనల్స్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ మెటబాలిజం జర్నల్‌లో పబ్లిషైన స్టడీలో సైతం ఇదే వెల్లడైంది.

పిల్లల మెదడు సామర్థ్యం, వారి ఆలోచనల పని తీరుపై ఫోకస్ చేసిన పరిశోధకులు అధ్యయనంలో భాగంగా 13 దేశాలకు చెందిన 6,469 మంది పిల్లలను విశ్లేషించగా, 60% మంది పిల్లలు రోజువారీ అవసరమైన నీటిని తాగడం లేదని తేలింది. ఇక పాఠశాల్లోని పిల్లలు తమ అవసరాల్లో 14% నీటిని మాత్రమే తాగుతున్నారని, ఇది వారి ఎదుగుదల, మానసిక, శారీరక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశోధకులు అంటున్నారు. పిల్లలే కాదు పెద్దలు కూడా సరిపడా నీరు తాగకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు.

అవసరానికి సరిపపడా నీరు తాగపోవడమనేది కేవలం దాహానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, అది పిల్లల్లో నరాల పనితీరు మందగించడానికి, మెదడు మొద్దు బారడానికి, మెదడు పరిమాణం, శ్రద్ధ, జ్ఞాపక శక్తి తగ్గడానికి కారణం అవుతుందని పరిశోధకులు గుర్తించారు. మరీ తక్కువ నీరు తాగే పిల్లల్లో ఆత్మ విశ్వాసం లోంపించడం, భావోద్వేగ స్థిరత్వం లేకపోవడం వంటి సమస్యలు సైతం తలెత్తుతాయని కనుగొన్నారు. అందుకే సరిపడా నీళ్లు తాగేలా చూడాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. అలాగనీ మరీ అధికంగా నీరు తాగడం కూడా కాదిక్కడ. పిల్లల వయసు, శారీరక పరిమాణాన్ని బట్టి కూడా రోజూ తీసుకోవాల్సిన నీటిలో హెచ్చు తగ్గులు ఉంటాయి. మొత్తానికి ఎల్లప్పుడూ బాడీ హైడ్రేటెడ్‌గా ఉండేలా నీరు తాగాల్సిన అవసరం ఉందని పరిశోధకులు సూచిస్తున్నారు. Link

Next Story