- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, ఫీచర్స్ : ఒకటి కాదు, రెండు కాదు 47 ఏండ్ల నిరీక్షణకు తెరపడింది. మహిళల వన్డే ప్రపంచ కప్ ఆటలో భారత్ సత్తా చాటింది. మొత్తం భారత జట్టు సమష్టి కృషి ఫలితమే హర్మన్ ప్రీత్ కౌర్ బృందం అందుకున్న ప్రపంచ కప్ విజయం. ఇందులో ఒక్కో క్రీడారిణిది ఒక్కో స్టైల్. ప్రతీ ఒక్కరి ఆటతీరు ప్రత్యేకమే. అలాంటి ప్రత్యేకతల ఏకత్వంలోని ఓ వ్యక్తే మన తెలుగమ్మాయి శ్రీ చరణి.
శ్రీచరణి పూర్తిపేరు నల్లపురెడ్డి శ్రీ చరణిరెడ్డి. ఆమె తండ్రి చంద్రశేఖర్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, వైఎస్సార్ కడప జిల్లా, వీరపు నాయిని మండలంలోని ఎర్రమల్లె స్వగ్రామం. శ్రీచరణి లెఫ్ట్-ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్ బౌలర్‌గా ప్రసిద్ధి. అసలే మారుమూల పల్లె, ఆపై ఓ పేద కుటుంబం నుంచి వచ్చిన శ్రీచరణికి పేదరికాన్ని, కష్టాలను ఎదిరించిన అనుభవమో, అవగాహనో ఏమో కానీ.. క్రికెట్‌లో ప్రత్యర్థి టీమ్‌ను ఓడించడంలో తనవంతు రికార్డ్ క్రియేట్ చేసింది.
మామయ్య ప్రోత్సాహంతో..
శ్రీచరణి నిజానికి క్రికెట్ అవ్వాలని మొదట్లో అనుకోలేదట. చిన్నప్పుడు బ్యాడ్మింటన్, కబడ్డీ, అథ్లెటిక్స్‌లో ప్రతిభ చూపేది. కాగా పదహారేండ్ల వయస్సులో ఆమెకు క్రికెట్‌పై మక్కువ పెరిగింది. ఆమె కుటుంబ సభ్యులు మొదట క్రికెట్‌లో ప్రోత్సహించలేదు. తర్వాత ఏడాదికి ఓకే అన్నారు. కానీ మామయ్య కిషోర్ కుమార్ రెడ్డి మొదటి నుంచి ప్రోత్సహించారు. శ్రీచరణి క్రికెట్‌లో ఫాస్ట్ బౌలర్‌గా శిక్షణ పొందింది. కానీ ఇందులో వికెట్లు లభించకపోవడంతో స్పిన్ బౌలింగ్‌ను ప్రయత్నించి సక్సెస్ అయింది. తర్వాత క్రమంలో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్‌గా మారింది. కేవలం రెండేండ్లలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) సెలెక్టర్ల దృష్టిలో పడిన ఆమె ఇంటర్నేషనల్ క్రికెట్‌కు ఎంపికై నేడు సంచలనంలో భాగమైంది.






