- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Social Media : తగ్గేదేలే..! 2024లో పెరిగిన సోషల్ మీడియా యూజర్లు
Social Media : తగ్గేదేలే..! 2024లో పెరిగిన సోషల్ మీడియా యూజర్లు

దిశ, ఫీచర్స్ : ఇన్‌స్టా, ఫేస్ బుక్, ఎక్స్, థ్రెడ్, షేర్ చాట్, స్నాప్ చాట్.. వాట్సాప్, యూట్యూబ్.. వేదిక ఏదైతేనేం యువతరానికి ఫుల్ కిక్కిస్తోంది సోషల్ మీడియా. ఒక విధంగా చెప్పాలంటే వరల్డ్ వైడ్ అత్యధిక డిమాండ్ పెరుగుతున్న ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ హబ్ ఇదే. ఎలాంటి అడ్డంకులు లేకుండా తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్త పరిచే అవకాశం ఉండటంతో పిల్లలు, పెద్దలు, యువత దీనిని ఆశ్రయిస్తున్నారు. నచ్చిన అభిరుచులను, అభిప్రాయాలను అందులో పంచుకుంటున్నారు. 2024లో వరల్డ్ వైడ్ చూస్తే 520 కోట్ల (5.2 billions) మంది సోషల్ మీడియాను యూజ్ చేసుకున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇక కొత్తగా సోషల్ మీడియా ఎకౌంట్లు ఓపెన్ చేసినవారు 28 కోట్లకు పైగానే ఉన్నారు. మొత్తానికి గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి వినియోగం 4 రెట్లు పెరిగింది. ఇక 2025లో మరింత దూసుకుపోయే చాన్స్ ఉందంటున్నారు నిపుణులు.
* సోషల్ మీడియాలో ఎక్కువమంది ఫాలోవర్లు ఉన్న సెలబ్రిటీల విషయానికి వస్తే పోర్చుగల్ ఫుట్ బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డ్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. అతడిని దాదాపు 65 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. కాగా ఇటీవల ఆయన యూ ట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించగా.. 10 నిమిషాల్లోనే 10 లక్షల మంది సబ్ స్క్రై్బ్ చేసుకోవడం, అట్లనే వన్ డేలోనే రెండున్నర కోట్ల మంది ఆ సంఖ్యను చేరుకోవడం ప్రపం రికార్డయింది.
* భారత్‌లో అత్యధిక మంది సోషల్ మాడియా ఫాలోవర్స్ ఉన్నవారిని పరిశీలిస్తే విరాట్ కోహ్లి 270.89 మిలియన్ల ఫాలోవర్లతో ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా, ప్రపంచ వ్యాప్తంగానూ అత్యధికమంది ఫాలోవర్లు ఉన్న ఇండియన్ క్రికెటర్ ఇతనే. రెండవ స్థానంలో బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ 94.34 మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉండగా, మూడవ స్థానంలో ప్రియాంక చోప్రా 92.61 మిలియన్ల మందితో ముందున్నారు. ఇక ఆ తర్వాత వరుసగా అలియాభట్ 86.13 మిలియన్లు, దీపికా పదుకొణె 80.49 మిలియన్లు, కత్రినా కైఫ్ 80.46 మిలియన్లు, నేహా కక్కర్ 78.59 మిలియన్లు, ఊర్వశీ రౌటేలా 72.59 మిలియన్లు, ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ 69.87 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉన్నారు.
*వివిధ సోషల్ మీడియా యూజర్ల సంఖ్యను పరిశీలించినప్పుడు ప్పంచ వ్యాప్తంగా అత్యధిక మందిని ఆకట్టుకున్న సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ మెటా. కాగా తర్వాతి స్థానంలో ఇన్ స్టాగ్రామ్ ఉంది. వీటి వినియోగదారుల్లో భారతీయులు చాలా మంది ఉన్నారు. కాగా 27 కోట్ల ఫాలోవర్లతో ఇన్ స్టా గ్రామ్‌లో ఇండియాలో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచిన సెలబ్రిటీగా విరాట్ కోహ్లీ అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక ఎక్స్‌లో ప్రధాని నరేంద్రమోడీ 10 కోట్ల మంది ఫాలోవర్లతో గ్రేట్ పొలిటీషియన్‌గా ఆకట్టుకున్నారు.
*సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లలో లింక్డ్ ఇన్ చూసేవారి సంఖ్య ఒక్క 2024లోనే వందకోట్లకు పెరగగా.. వీక్లీ ఆరున్నరకోట్ల మంది ఇందులో కేవలం జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారు. ఇక నిమిషానికి ఆరుగురు ఈ వేదిక ద్వారా ఉద్యోగాలు పొందుతున్నారు. మరో విషయం ఏంటంటే.. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 25 శాతం మంది నెటిజన్లు షాపింగ్ కోసం సోషల్ మీడియా వేదికలను యూజ్ చేశారు. ఇక చాట్ జీపీటీ, ఏఐ టెక్నాలజీ సోషల్ మీడియాలో ఎంట్రీ ఇవ్వడంతో మరిన్ని కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లను యూజ్ చేయడం ఈజీ అయిపోయింది. రోజు రోజుకూ యూజర్లు పెరుగుతున్నారు. కొత్త స్టార్టప్స్ ప్రారంభించేవారు తమ ఎదుగుదలకోసం సోషల్ మీడియాను చక్కటి వేదికగా భావిస్తున్నారు. దీంతో ఈ ఏడాది సోషల్ మీడియాలో ప్రకటనలకోసం భారతీయులు పెట్టిన మొత్తం ఖర్చు రూ. 11 వేల కోట్లు.
* 2024లో అత్యధికంగా డబ్బు సంపాదించిన యూట్యూబ్ ఛానల్ మిస్టర్ బీస్ట్. దీనిని అమెరికాకు చెందిన జేమ్స్ స్టీఫెన్ డోనాల్డ్ సన్ రన్ చేస్తున్నారు. అతని సాహసాలు, వెరైటీ స్టంట్లు యువతను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో సబ్ స్క్ర్రైబర్ల సంఖ్య సుమారు 34 కోట్లకు పైగా దాటిందని, 2024లో దీని ఆదాయం సుమారు రూ. 723 కోట్లు ఉందని ఫోర్బ్స్ మ్యాగజైన్ పేర్కొంది. అట్లనే కేరళకు చెందిన మహమ్మద్ రిజ్వాన్ అనే వ్యక్తి ఓ జలపాతం వద్ద నిలబడి ఫుట్ బాల్‌ను కాలితో తన్నగా అది జలపాతంలో కలిసిపోయినట్లు అనిపించే జస్ట్ 7 సెకన్ల రీల్ ఒకటి 024లో సుమారు 49 కోట్ల మంది చూశారు. దీంతో మోస్ట్ వాచ్డ్ లిస్ట్‌లో గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేసింది.
*సోషల్ మీడియా వినియోగంతో 2024లో ఇన్‌ఫ్లుయెన్సర్ కల్చర్ కూడా బాగా పెరిగింది. భారీ మొత్తంలో ఫాలోవర్స్‌ను కలిగినవారు తాము ప్రమోట్ చేసే ఉత్పత్తులు, సేవలు, ఆలోచనల గురించి సోషల్ మీడియాలో పంచుకోవడం పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. 2024లో బిలియన్ డాలర్ల పరిశ్రమగా ఇన్‌ఫ్లుయెన్సర్ కల్చర్ మారింది. రాబోయే రోజుల్లో మరింత పెరగనుంది.
*ఇక సోషల్ మీడియా వినియోగం వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయి? లాభమా.. నష్టమా ? అని చూసినప్పుడు రెండూ ఉన్నాయంటున్నారు నిపుణులు. దీనిని అవగాహన కోసం, వ్యాపార అభివృద్ధి కోసం, ప్రజల్లో నెట్వర్క్ కోసం ఉపయోగించుకోవడంవల్ల చాలా మంది లాభపడుతున్నారు. అలాగే ప్రపంచమే ఓ కుగ్రామం అయిన ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ప్రతీ సమాచారం క్షణాల్లో ప్రత్యక్ష్యం అవుతోంది. ఇక నష్టం గురించి చూస్తే అతివినియోగం మానసిక రుగ్మతలకు దారితీస్తుండగా.. సోషల్ మీడియాలో వ్యూస్‌లు, లైకులకోసం యువత ఆరాట పడుతూ అనర్థాలు కొని తెచ్చుకుంటోంది. రీల్స్ పిచ్చి, వెరైటీ స్టంట్లతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటోంది. అలాగే ఫేక్ వీడియోలు, ఫ్రాంక్ వీడియోలు, ట్రోలింగ్స్ వంటివి చాలానే ఉంటున్నాయి. మొత్తానికి మిస్ యూజ్ కారణంగా 2020లో సుమారు 1.54 మిలియన్ల మంది మరణాలకు సోషల్ మీడియా కారణమైందని నివేదికలు చెబుతుండగా.. 2024లో మరింత పెరిగి ఉండవచ్చునని నిపుణులు అంటున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం యువతను, ప్రజలు హెచ్చరించింది.






