మీరు వినియోగించే స్మార్ట్ ఫోన్ క్యారెక్టర్ డిసైడ్ చేస్తుంది తెలుసా?

by Disha Web |
మీరు వినియోగించే స్మార్ట్ ఫోన్ క్యారెక్టర్ డిసైడ్ చేస్తుంది తెలుసా?
X

దిశ, ఫీచర్స్: మీరు ఉపయోగించే స్మార్ట్ ఫోన్ మీ క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో డిసైడ్ చేయగలదు. మీ ప్రిఫరెన్సెస్, మూడ్, యాటిట్యూడ్.. ఇలా అన్ని విషయాల్లో ఓ క్లారిటీ తీసుకురాగలదు. అంతేకాదు మీ మొబైల్ మీరు ఎంత మంచి డ్రైవర్స్ అనే విషయాన్ని కన్వే చేయగలదు. ఫోన్ వాడకం ఆధారంగా డ్రైవింగ్ స్కిల్స్ ఎలా ఉంటాయన్న అంశంపై చేపట్టిన అధ్యయనంలో ఆండ్రాయిడ్ యూజర్స్.. ఐఫోన్ వినియోగదారులను బీట్ చేశారు. కార్లు, వాహనాలకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ పైచేయి సాధించడం విశేషం.

స్మార్ట్ ఫోన్ కార్ ఇన్సూరెన్స్ కంపారిజన్ సైట్ 'జెర్రీ' కండక్ట్ చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 20వేల మంది పార్టిసిపెంట్స్‌పై జరిగిన అధ్యయనం.. 14 రోజుల్లో 13 మిలియన్ కిలోమీటర్స్ డేటాను కలెక్ట్ చేసి ఈ ఇంట్రెస్టింగ్ అంశాలను కనిపెట్టింది. యాక్సిలరేషన్, స్పీడ్, బ్రేకింగ్, టర్నింగ్, డిస్ట్రాక్షన్ లాంటి సబ్ స్కోర్స్‌ను కూడా దృష్టిలో ఉంచుకున్న రీసెర్చ్.. ఐఫోన్ యూజర్స్ కన్నా ఆండ్రాయిడ్ వినియోగదారులు ఓపెన్‌గా, నిజాయితీగా ఉంటారని కనుగొంది. లగ్జరీ లైఫ్‌ను కోరుకోరని, రూల్స్ బ్రేక్ చేసేందుకు వెనుకాడరని వివరించింది. ఇక ఐఫోన్ యూజర్స్ గురించి రిపోర్టు దాదాపు నెగెటివ్‌ ఉండగా.. స్థిరంగా ఉండకుండా, ఎప్పుడూ ఇమాజినేషన్‌లో బతుకుతారని తెలిపింది. కానీ ఎక్కువ ఎమోషనల్‌గా ఉంటారని, డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆండ్రాయిడ్ యూజర్స్ కన్నా ఎక్కువ సార్లు మొబైల్ చెక్ చేస్తుంటారని గుర్తించింది. ఇక ఐఫోన్ యూజ్ చేసే వ్యక్తులు అడ్వెంచర్స్ ఇష్టపడితే.. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఎంచుకున్న వ్యక్తులు సేఫ్‌గా ఉంటారని పేర్కొంది అధ్యయనం.


Next Story

Most Viewed