Viral: : ఆ సమయం కంటే తక్కువగా నిద్రపోతే..! 2050 నాటికి జరిగేది ఇదే..

by Javid Pasha |   (  Updated:2024-12-20 16:03:41  IST  )

Viral: : ఆ సమయం కంటే తక్కువగా నిద్రపోతే.. 2050 నాటికి జరిగేది ఇదే..

Viral: : ఆ సమయం కంటే తక్కువగా నిద్రపోతే..! 2050 నాటికి జరిగేది ఇదే..
X

దిశ, ఫీచర్స్ : మనం రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే అంతకు ముందు రాత్రి కంటి నిండా నిద్రపోయి ఉండాలని నిపుణులు చెబుతుంటారు. లేకపోతే ఏకాగ్రత కుదరదని, చేసే పనిలో ప్రొడక్టివిటీ తగ్గే అవకాశం ఉంటుందని అంటారు. అందుకే ప్రతి రోజూ కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలని సూచిస్తుంటారు. ముఖ్యంగా నాణ్యమైన నిద్ర మన జీవక్రియలో సానుకూల మార్పులు తెస్తుంది. కానీ నేటి ఉరుకులు పరుగు జీవితంలో చాలామందిని నిద్రలేమి సమస్య వెంటాడుతోంది. అప్పుడప్పుడూ తక్కువ నిద్రపోతే పెద్ద ప్రమాదం ఉండకపోవచ్చు. కానీ ఎక్కువ రోజులపాటు 6 గంటలకంటే తక్కువ సేపు నిద్రపోతూ ఉంటే మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. త్వరగా వృద్ధాప్యం సంభవిస్తుంది. అయితే ఇలా రోజూ 6 గంటలకంటే తక్కువసేపు నిద్ర అలవాట్లు దీర్ఘకాలం కొనసాగే జీవనశైలి కలిగి ఉండే వ్యక్తుల జీవితం 2050 నాటికి ఎలా ఉంటుంది? అప్పటికి వీరి శరీరంలో వచ్చే మార్పులేమిటి? అనే విషయమై ప్రస్తుతం నెట్టిటంట ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఆ వివరాలేంటో చూద్దాం.

చిన్న వయసులోనే వృద్ధాప్యం

తగినంత నిద్రలేపోతే 2050 నాటికి మనుషులు ఎలా ఉంటారో అనే విషయమై బ్రిటన్‌కు చెందిన స్లీప్ ఎక్స్‌పర్ట్ ఒకరు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను వెల్లడించారు. అందుకు సంబంధించిన డిజిటల్ ఇమేజ్‌లను కూడా షేర్ చేశారు. ‘బెన్సర్ ఫర్ బెడ్స్’ సంస్థ పరిశోధన ప్రకారం.. రాత్రిళ్లు తక్కువ నిద్రపోయే పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే 2025లో ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్యల్లో చిన్న వయసులోనే వృద్ధుగా కనిపించే అవకాశం ఉంది. అంతేకాకుండా తరచుగా వెన్ను నొప్పి బారిన పడటం, స్కిన్ డల్‌గా, అంద విహీనంగా మారడం, కాళ్లు, చేతుల్లో వాపు, కండరాలు సన్నబడటం, కళ్లు ఎర్రబడటం వంటి ప్రాబ్లమ్స్ అత్యంత ఎక్కువ మంది ఫేస్ చేస్తారు. ఇక నిద్రలేమి రోగ నిరోధక శక్తికి దారితీయడంవల్ల మళ్లీ వివిధ వైరస్‌లు, ముఖ్యంగా ఫ్లూ బారిన పడే అవకాశం ఉంది. అంతేకాకుండా శరీరంలో ఆకలిని పెంచే హార్మోన్లు తగ్గుతాయి. ఒబేసిటీ, గుండె జబ్బులు, టైప్ - 2 డయాబెటిస్ వంటి రోగాలు అత్యధిక మందికి కేవలం నిద్రలేమి కారణంగా తలెత్తే చాన్సెస్ ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు. కాబట్టి వచ్చే సంవత్సరం జీవనశైలిలో సానుకూల మార్పులు చేసుకోవాలని, ముఖ్యంగా నాణ్యమైన నిద్రకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. నేషనల్ స్లీప్ ఫౌండేషన్ ప్రకారం.. ఒక రోజులో వ్యక్తులు ఏ వయసులో ఎన్ని గంటలు నిద్రపోతే మంచిదో వివరిస్తున్నారు.

ఐదేండ్లలోపు వయసులో..

0 నుంచి 3 నెలల వయసు గల శిశువుల్లో ఒక రోజు స్లీప్ టైమింగ్14 నుంచి 17 గంటలు ఉండాలి. హెచ్చు తగ్గుల విషయానికి వస్తే 9 గంటలకంటే తక్కువ, 19 గంటలకంటే ఎక్కువ నిద్రపోవడం ఆరోగ్య దాయకం కాదు. ఇక 4 నుంచి 11 నెలల వయసులో 12 నుంచి 15 గంటలు నిద్ర అవసరం. కాగా 10 గంటలకంటే తక్కువ గానీ.. 18 గంటలకంటే ఎక్కువ సేపు గానీ నిద్రపోవద్దు. ఏడాది నుంచి రెండేండ్ల వయసులో రోజులో 5 నుంచి 14 గంటలు నిద్ర అవసరం. 9 గంటలకంటే తక్కువగా 16 గంటల కంటే ఎక్కువగా నిద్రపోవద్దు. మూడు నుంచి ఐడేండ్ల వయసులో 10 నుంచి 13 గంటలు నిద్ర తప్పనిసరి. అట్లనే 8 గంటలకంటే తక్కువ, 14 గంటలకంటే ఎక్కువ మాత్రం తగదు.

6 నుంచి 65 ఏండ్ల వయసులో..

6 నుంచి 13 ఏండ్ల వయసులో 9 నుంచి 11 గంటలు నిద్ర అవసరం. అయితే 7 గంటలకంటే తక్కువ, 12 గంటలకంటే ఎక్కువసేపు మాత్రం నిద్రపోవద్దు. 14 నుంచి 17 సంవత్సరాల వయసులో 8 నుంచి 10 గంటలు నిద్ర అవసరం. కాగా 7 గంటలకంటే తక్కువసేపు, 11 గంటలకంటే ఎక్కువసేపు మాత్రం నిద్రపోవద్దు. 18 నుంచి 25 సంవత్సరాల వయసులో ఒక రోజులో 7 నుంచి 9 గంటలు నిద్ర అవసరం.. అయితే 6 గంటలకంటే తక్కువ, 11 గంటలకంటే ఎక్కువసేపు నిద్ర తగదు.

ఇక 26 నుంచి 64 ఏండ్ల వయసులో 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలి. అయితే 6 గంటలకంటే తక్కువ సేపు, 10 గంటలకంటే ఎక్కువ సేపు మాత్రం నిద్రపోకూడదు. 65 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయసు గలవారిలో 7 నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరి. అయితే 5 గంటలకంటే తక్కువ సేపు గానీ 9 గంటలకంటే ఎక్కువసేపు గానీ నిద్రపోవద్దు. అయితే 2050 నాటికి ఈ విధమైన స్లీపిగ్ టైమ్ షెడ్యూల్ దారితప్పే అవకాశం ఉండవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో రకరకాల అనారోగ్యాల బారిన పడవచ్చునని చెబుతున్నారు.

*నోట్: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.





Next Story