- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Trends : ఆరడుగుల అందగాడే కావాలి..! 50% మంది అమ్మాయిల ఫీలింగ్ ఇదే..!!
ఆన్‌లైన్ డేటింగ్ యాప్స్ ఉపయోగించే మహిళలలో దాదాపు 50% మంది, తమకు కాబోయే భాగస్వామి హైట్ 6 అడుగులు (183 సె.మీ) లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలని పేర్కొంటున్నారు.

దిశ, ఫీచర్స్ : పెళ్లి, ప్రేమ వంటి విషయాల్లో సాధారణంగా అమ్మాయిలైనా, అబ్బాయిలైనా అన్ని విషయాల్లో తమకు సెట్ అయ్యే వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటారు. తమకంటే మరీ హైట్ ఎక్కువున్న వ్యక్తినో, మరీ తక్కువున్న వ్యక్తినో కాకుండా సమానంగానో, కాస్త అటూ ఇటుగానో ఉండాలని భావిస్తుంటారు. మొత్తానికి ఈడూ జోడూ కుదరాలనుకుంటారు. కానీ ఇటీవల పలువురిలో అభిప్రాయాలు మారుతున్నాయని, నయా ట్రెండ్స్ పుట్టుకొస్తున్నాయని డేటింగ్ యాప్‌లు సర్వేలు, ఆన్‌లైన్ వేదికలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా పొట్టిగా ఉండే అమ్మాయిలు తమకు సమానమైన ఎత్తుకు బదులుగా, తమకంటే చాలా ఎక్కువ హైట్ ఉండే అబ్బాయిలతో డేటింగ్ చేయాలని, పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారు. ఆ వివరాలేంటో చూద్దామా!
ఒకప్పటిలా యువతలో స్థిరమైన అభిప్రాయాలో, పాతకుపోయిన భావాలో ఉండటం లేదు. తమ ఆసక్తి, అభిరుచి, అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు మార్చుకుంటున్నారు. ముఖ్యంగా సంబంధాల ఎంపిక విషయంలో అదే చేస్తున్నారు. సాధారణ హైట్ కలిగిన అమ్మాయిలకంటే, పొట్టిగా ఉండే అమ్మాయిలు తమకు ఆరడుగుల ఎత్తుగల అబ్బాయిలే కావాలని కోరుకుంటున్నారు. డేటింగ్‌యాప్‌లలో, మ్యాట్రిమోనీ సైట్లలో కూడా ఇదే అంశాలను నమోదు చేసుకుంటున్నారని బంబుల్, టిండర్ వంటి ప్రముఖ డేటింగ్ యాప్ సర్వేలు పేర్కొంటున్నాయి.
ఆన్‌లైన్ డేటింగ్ యాప్స్ ఉపయోగించే మహిళలలో దాదాపు 50% మంది, తమకు కాబోయే భాగస్వామి హైట్ 6 అడుగులు (183 సె.మీ) లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలని పేర్కొంటున్నారు. దీనివల్ల సగటు ఎత్తుకంటే తక్కువ హైట్ గల పురుషులు చాలా మంది ముందే తొలగించబడుతున్నారు. అంతేకాదు ఈ విధమైన ప్రభావం సంబంధాలపై పడుతోంది. ఎందుకంటే.. మహిళల్లో 70% వరకు, ముఖ్యంగా 50% పైగా పొట్టిగా ఉండే అమ్మాయిలు లేదా మహిళలు పురుషుల ఎత్తు ఆధారంగానే మ్యాచింగ్ ప్రొఫైల్స్‌ను స్వైప్ చేస్తున్నారట. అంటే 6 అడుగుల ఎత్తుగల పురుషులపైనే ఆసక్తి చూపుతున్నారు. దీని వల్ల హైట్ తక్కువున్న పురుషులకు కన్వర్జేషన్‌కు ముందే 90% సంబంధాలు దూరం అవుతున్నాయి.
ముఖ్యంగా ఆరడుగుల ఎత్తు కలిగిన పురుషులు చాలా తక్కువగానే ఉంటున్నారు. అమెరికాలో అయితే 6 అడుగులు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్న పురుషులు కేవలం 14.5% మాత్రమే ఉంటున్నారు. ఇక 6 అడుగుల 2 అంగుళాలు (188 సె.మీ) పైబడినవారు 3.9% మాత్రమే ఉంటున్నారు. కానీ మహిళలలో 71% మంది మాత్రం తమ ఐడియల్ పార్ట్‌నర్ ఎత్తును 6 అడుగుల నుంచి 6.6 అడుగులు ఉండాలని కలలు గంటున్నారు. దీంతో కొందరికి పెళ్లిళ్లు అవకపోగా, మరికొందరు రియలైజ్ అయ్యేసరికి వయసు పెరగిపోయి, తర్వాత సంబంధాలు రాక ఇబ్బందులు పడుతున్నారు.
పొడుగు ఎక్కువగా ఉండే అబ్బాయిలనే పెళ్లి చేసుకోవాలనే భావన కేవలం మానసికపరమైనదే అయినప్పటికీ చాలామందిలో ఇది నాటుకుపోతోందని మానసిక నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా పొట్టి అమ్మాయిల్లో ఇది సేఫ్టీ ఫీలింగ్ కలిగిస్తోందట. కానీ పురుషులలో (ముఖ్యంగా 5.8 కంటే తక్కువ ఎత్తు ఉన్నవారిలో) మాత్రం తాము హైట్ లేని కారణంగా అమ్మాయిలకు నచ్చడం లేదేమోననే భావనతో డిప్రెషన్‌కు కారణం అవుతోందని పేర్కొంటున్నారు. ఇక 15% మంది మహిళలు మాత్రమే భాగస్వామి విషయంలో హైట్ గురించి పట్టించుకోవడం లేదు. 5 అడుగులు ఉంటే చాలని భావిస్తున్నారు. Link






