క్రోమోజోమ్స్‌కు X-ఆకారం.. సీక్రెట్ బయటపెట్టిన శాస్త్రవేత్తలు

by Disha Web Desk 7 |
క్రోమోజోమ్స్‌కు X-ఆకారం.. సీక్రెట్ బయటపెట్టిన శాస్త్రవేత్తలు
X

దిశ, ఫీచర్స్: క్రోమోజోములకు సంబంధించిన గొప్ప రహస్యాన్ని చేధించారు బ్రిటన్ శాస్త్రవేత్తలు. జీవి యొక్క జన్యు పదార్థాన్ని కలిగిన డీఎన్‌ఏ అణువులే క్రోమోజోములని 1800 చివర్లో కనుగొనబడింది. జీవి కణాలను విభజించడానికి ముందు X-ఆకారంలోకి మారుతాయని గుర్తించబడింది. అయితే అసలు క్రోమోజోములు ఈ ఐకానిక్ ఆకారంలోనే ఎందుకుంటాయనే సీక్రెట్‌‌ను కనుగొన్నారు పరిశోధకులు.

కణ విభజన సమయంలో సంబంధిత క్రోమోజోమ్‌ల స్థిరత్వానికి కారణమయ్యేషుగోసిన్(SGO1) అనే ప్రోటీన్.. క్రోమోజోమ్‌లను X ఆకారంలోకి లాక్ చేస్తుందని గుర్తించారు. ‘ఒక క్రోమోజోమ్ వాస్తవానికి రెండు పొడవైన డీఎన్ఏ థ్రెడ్‌లను కలిగి ఉంటుంది. రింగ్ ఆకారపు కోహెసిన్ అణువుల హోస్ట్ ఈ రెండు థ్రెడ్స్‌ను కలిపి ఉంచుతుంది. కణం విభజించబడేటప్పుడు ఈ కోహెసిన్ రింగ్‌ తెరుచుకుని, డీఎన్‌ఏ థ్రెడ్స్ విడిపోతాయి.

SGO1 అని పిలువబడే ప్రోటీన్.. క్రోమోజోమ్‌లకు X ఆకారాన్ని ఇచ్చే కోహెసిన్ రింగులను లాక్ చేస్తుంది’ అని వివరించారు పరిశోధకులు. కాగా కణ విభజన సమయంలో క్రోమోజోమ్‌ల ఐకానిక్ X ఆకారం ఎలా ఉత్పత్తి చేయబడుతుందో పరమాణు స్థాయిలో అర్థం చేసుకోవడం ఎగ్జయిటింగ్‌గా ఉందంటున్న శాస్త్రవేత్తలు... ఈ ప్రాసెస్ వ్యాధిలో ఎలా తప్పుగా మారుతుందని తెలుసుకోవడం కూడా ముఖ్యం అంటున్నారు.


Next Story

Most Viewed